క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయం:- చైనా రాజధాని బీజింగ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బీజింగ్‌లోని ఒక భారీ భవనాన్ని విమానం ఢీ కొట్టింది. ఈ భారీ ప్రమాదానికి సంబంధించి ఇప్పటి వరకు చైనా అధికారులు స్పందించలేదు. అయితే, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు మాత్రం పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు ప్రకారం భారీ ఎత్తున ఉన్న ఒక భవనాన్ని ఒక విమానం అత్యంత వేగంగా వెళ్లి ఢీ కొట్టింది. భవనాన్ని ఢీ కొట్టిన తరువాత విమానం ముక్కలై కింద కార్లపై పడింది. శుక్రవారం చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఒక చిన్న విమానం తన నిర్ధేశిత విమాన మార్గం నుంచి తప్పిపోయి బీజింగ్‌లోని ఎత్తైన భవనాన్ని ఢీ కొట్టినట్టు తెలుస్తోంది.
వీడియో, ఫొటోలు ప్రకారం సన్‌వర్ట్ ఎస్‌ఏ 60 ఎల్ అరోరా లైట్ ఎయిర్ క్రాఫ్ట్ ఈ ప్రమాదానికి గురైనట్టు చెబుతున్నారు. ఈ వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం సుమారు 1700 అడుగులు ఎత్తు ఉన్న చైనా జూన్ భవనం నుంచి విమాన శకలాలు కింద పడ్డాయి. భవనం అడుగు భాగం దగ్గర దట్టమైన పొగలు ఎగసిపడుతున్న దృశ్యాలు కనిపించాయి. ఘటనా స్థలంలో విమాన శకలాలు చెల్లాచెదురుగా పడినట్టు కనిపించాయి.
-
ప్రమాదంపై స్పందించిన యంత్రాంగం..
ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నప్పటికీ అధికారులు మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు అధికారులు దృష్టికి కూడా వెళ్లినట్టు చెబుతున్నారు. అయితే, ఈ ప్రమాదంలో ఎంత మంది ప్రాణాలను కోల్పోయారు. ఎంత మంది గాయపడ్డారు అన్నది తెలియాల్సి ఉంది. మృతులు, గాయపడిన వారి సంఖ్యపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందని చెబుతున్నారు.