క్రైమ్ మిర్రర్, జాతీయం:- హైడ్రోజన్ రైళ్లు నడుపుతున్న దేశాల సరసన్ భారత్ చేరనుంది. ఈ మేరకు భారతీయ రైల్వే కీలక నిర్ణయాన్ని తీసుకుంది. మొట్టమొదటి హైడ్రోజన్ రైలుకు తాజాగా భారతీయ రైల్వే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హైడ్రోజన్ రైళ్ల నిర్వహణకు మార్గం సుగమమైనట్టు అయింది. తాజాగా తీసుకురానున్న హైడ్రోజన్ రైలు హర్యానాలోని నార్తర్న్ రైల్వే పరిధఙలోని జింద్ – సోనిపట్ మార్గంలో నడవనుంది. బ్రాడ్ గేజ్ నెట్‌వర్క్‌పై నడపబోతున్న ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, పొడవైన హైడ్రోజన్ రైలుగా దీన్ని పేర్కొంటున్నారు. ఇకపోతే, భారత్ హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హైడ్రోజన్ రైలు నిర్వహిస్తున్న దేశాల జాబితాలో భారత్ చేరనుంది.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి దేశాల హైడ్రోజన్ రైలు ఉంది. ఇప్పుడు ఈ జాబితాలో భారత్ కూడా చేరనుంది. భారత్ తీసుకురానున్న పది కోచ్‌లు ఉంటాయి. రెండు డ్రైవింగ్ పవర్ కార్లలో ఒక్కో దానికి 1200 కిలో మీటర్లు సామర్థ్యం కలిగిన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వ్యవస్థ ఉంటుంది. దీని పవర్ 2400 కిలో వాట్లు. దీని కమర్షియల్ స్పీడ్ గంటకు 75 కిలో మీటర్లు. ట్రయల్ సమయంలో ఇది గంటకు 120 కిలో మీటర్లు వేగంతో నడిచినట్టు అధికారులు చెబుతున్నారు. ఒక్కోసారి హైడ్రోజన్ నింపితే సుమారు 250 కిలో మీటర్లు దూరం వేగంతో ప్రయాణిస్తుంది. ప్రత్యేకంగా హైడ్రోజన్ సిలిండర్లు, బ్యాటరీలు, కంట్రోల్ సిస్టమ్ కోసం ప్రత్యేక భాగాలు ఉన్నాయి.
-
ప్రత్యేకంగా హైడ్రోజన్ సిలిండర్లు..
డీజిల్, ఎలక్ర్టిక్ లోకోమోటివ్‌లతో పోలిస్తే హైడ్రోజన్ రైలు వల్ల కాలుష్యం కూడా తక్కువగా ఉంటుంది. ఈ రైలులో హైడ్రోజన్, ఆక్సిజన్ మధ్య జరిగే రసాయన చర్యద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. రైలు ముందు భాగంలో 27, వెనుకభాగంలో 27 హైడ్రోజన్ సిలిండర్లు ఏర్పాటు చేయనున్నారు. స్వదేశీ సాంకేతికతతో హైడ్రోజన్ నిల్వ, రీ ఫ్యూయలింగ్ కేంద్రాన్ని జింద్‌లో నిర్మించారు. ఈ రైలులో భద్రతకు పెద్ద పీట వేశారు. హైడ్రోజన్ లీక్ డిటెక్టర్లు, ఫ్లేమ్ డిటెక్టర్లు, భద్రతా సెన్సార్లు ఏర్పాట్లు చేశారు.
ఆత్మ నిర్భర్ భారత్ ప్రోగ్రామ్‌లో భాగంగా దీన్ని పూర్తిగా భారత్‌లోనే రూపొందించారు. రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్, ఆర్గనైజేషన్, లక్నో డిజైన్ అందించగా, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ – చెన్నైలో తయారు చేశారు. తాజాగా భారత్ హైడ్రోజన్ ఆధారిత రైలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతుండడంతో ప్రయాణీకులు సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రైళ్లను ప్రధానంగా విద్యుత్ లైన్లు వేయడం కష్టంగా ఉన్న ప్రాంతాలు, హెరిటేజ్ రైల్వే మార్గాల్లో వీటిని వినియోగించాలని రైల్వేశాఖ భావిస్తోంది.