Homeక్రైమ్హైద‌రాబాద్‌లో విషాద ఘ‌ట‌న‌...! క‌న్న తండ్రి దాడి...చికిత్స పొందుతూ బాలుడి మృతి...

హైద‌రాబాద్‌లో విషాద ఘ‌ట‌న‌…! క‌న్న తండ్రి దాడి…చికిత్స పొందుతూ బాలుడి మృతి…

హైద‌రాబాద్‌,క్రైమ్‌మిర్ర‌ర్‌: హైదరాబాద్‌లో మానవత్వాన్ని కలచివేసే ఘటన చోటుచేసుకుంది. గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వేపై నాలుగేళ్ల బాలుడిపై అతడి తండ్రి దారుణంగా దాడి చేసిన ఘటన విషాదాంతమైంది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు నాలుగు రోజుల అనంతరం మృతి చెందాడు. ఇటీవల పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్ 104 సమీపంలో తండ్రి సల్మాన్.. కన్న కొడుకు అర్మాన్‌ను పిల్లర్‌కు గుద్ది రోడ్డు మీద పడేశాడు.

Also Read:SCCLలో 300 అప్రెంటిస్‌షిప్‌ అవకాశాలు.. నెలకు రూ.12,300 వరకు స్టైపెండ్‌!

ఆపై డీసీఎం వాహనం కిందకు తోసేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. బాలుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా కొడుకు పట్ల తండ్రి ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ బాలుడు అర్మాన్ ఈరోజు(మంగళవారం) మృతిచెందాడు. భార్యతో గొడవ జరుగుతున్న సమయంలో బాలుడిపై దాడి చేసినట్లు సమాచారం. బాలుడి మృతితో హత్య కేసుగా మారుస్తూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Also Read:ఆగస్టు 14న ‘పాంచాలి పంచభర్తృక’.. ప్రేక్షకులను అలరించడమే లక్ష్యమంటున్న రాజేంద్ర ప్రసాద్

తాజావార్తలు