Homeతెలంగాణకల్వకుర్తి అభివృద్ధికి ఎమ్మెల్యే కసిరెడ్డి కీలక ప్రతిపాదనలు...!

కల్వకుర్తి అభివృద్ధికి ఎమ్మెల్యే కసిరెడ్డి కీలక ప్రతిపాదనలు…!

  • సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

  • ఆమనగల్‌, కల్వకుర్తి మున్సిపాలిటీలకు రూ.80 కోట్లు..

  • అదనంగా 2,000 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి..

 

క్రైమ్ మిర్రర్ (రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ): కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయడంతో పాటు పేద కుటుంబాలకు అదనంగా ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని కోరుతూ గౌరవ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

మున్సిపాలిటీలకు రూ.80 కోట్ల నిధులు…

Also Read:సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. 9 మంది మృతి

ఆమనగల్‌, కల్వకుర్తి మున్సిపాలిటీలలో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) తదితర మౌలిక వసతుల అభివృద్ధి కోసం మొత్తం రూ.80 కోట్ల నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు.ఆమనగల్‌ మున్సిపాలిటీకి రూ.30 కోట్లు, కల్వకుర్తి మున్సిపాలిటీకి రూ.50 కోట్లు కేటాయించి పట్టణాల్లో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రతిపాదించారు.

పేదల కోసం అదనంగా 2,000 ఇందిరమ్మ ఇళ్లు…

Also Read:ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. యువతి మృతి

కల్వకుర్తి నియోజకవర్గంలో పేద కుటుంబాలు అధికంగా ఉన్న నేపథ్యంలో అర్హులైన నిరుపేదలకు మరింత ప్రయోజనం చేకూర్చేలా అదనంగా 2,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా కోరారు. గృహ అవసరం అధికంగా ఉన్న కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని అదనపు ఇళ్లను మంజూరు చేస్తే మరిన్ని పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయవచ్చని ఎమ్మెల్యే వివరించారు.

గ్రామపంచాయతీలకు యూజీడీ కోసం రూ.50 కోట్లు…

Also Read:బస్ డిపోలో విషాదం.. మెకానిక్ దుర్మరణం

అదేవిధంగా కల్వకుర్తి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, గ్రామపంచాయతీలలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతులను బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదనలు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ప్రతిపాదనలపై సీఎం సానుకూల స్పందన…

Also Read:గస్టు 14న ‘పాంచాలి పంచభర్తృక’.. ప్రేక్షకులను అలరించడమే లక్ష్యమంటున్న రాజేంద్ర ప్రసాద్

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సమర్పించిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించి, అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని పట్టణాలు, గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు తీసుకువచ్చి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

తాజావార్తలు