Homeతెలంగాణఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. మరోసారి హైకోర్టు నోటీసులు!!

ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. మరోసారి హైకోర్టు నోటీసులు!!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. గతంలో ఈ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పలువురు ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు పరిశీలించింది. విచారణ సందర్భంగా అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఇచ్చిన తీర్పు కాపీలను కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలతో పాటు స్పీకర్ కూడా తమ కౌంటర్ దాఖలు చేయాలని మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇంతకుముందు జారీ చేసిన నోటీసులకు సంబంధించి ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో కేసు విచారణను వాయిదా వేస్తూ తదుపరి విచారణను జూలై 22కు నిర్ణయించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు