Homeఆంధ్ర ప్రదేశ్పుట్టిన గడ్డపై మమకారం.. పౌరసత్వం కోసం 94 ఏళ్ళ వృద్ధురాలి ఆరాటం!!

పుట్టిన గడ్డపై మమకారం.. పౌరసత్వం కోసం 94 ఏళ్ళ వృద్ధురాలి ఆరాటం!!

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్ : పుట్టిన గడ్డపైనే తుది శ్వాస విడచాలన్న కోరికతో అమెరికా వెళ్లి స్థిరపడిన 94 ఏళ్ళ వృద్ధురాలు భారతదేశ పౌరషత్వం కోసం ప్రయత్నిస్తోంది. గడచిన కొన్నాళ్లుగా అమెరికాలో ఉంటున్న ఆమె తాను పుట్టిన చోటే తుది శ్వాస విడిచాలన్న కోరికతో భారతదేశ పౌరసత్వాన్ని పొందేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఎంతోమంది భారతీయులు అమెరికా వెళ్లి స్థిరపడి పోవాలని, అక్కడి పౌరసత్వాన్ని పొందాలని భావిస్తుంటే.. 94 ఏళ్ల వృద్ధురాలు మాత్రం భారతదేశ పౌరసత్వం కోసం పరితపిస్తోంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బాపట్ల జిల్లా చినగంజాం మండలం చింత గుంపుల గ్రామానికి చెందిన కొండ్రు గుంట మహాలక్ష్మమ్మ (94) కుటుంబం 1993లో అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడిపోయింది. 2000వ సంవత్సరంలో మహాలక్ష్మమ్మతోపాటు కుటుంబ కుటుంబ సభ్యులందరికీ అమెరికా పౌరుసత్వం లభించింది.

కొన్నేళ్లుగా అమెరికాలో ఉన్న ఆమెకు తాను తొలి శ్వాసను భారతదేశంలోనే విడవాలన్న కోరికను కుటుంబ సభ్యులకు వెల్లడించింది. మళ్లీ తాను భారత్ వెళ్లిపోతానని కుమారుడుకు చెప్పింది. ఆమె ఆకాంక్షలను గుర్తించిన కుటుంబ సభ్యులు 2018 లో భారతదేశానికి తిరిగి పంపించారు. స్వగ్రామంలోనే 8 ఏళ్లుగా ఆమె ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె భారత దేశ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. దేశానికి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తి కావడంతో మరోసారి ఆమె తమ పౌరుషత్వానికి సంబంధించిన ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ క్రమంలోనే గతంలో రాష్ట్రస్థాయిలోని సచివాలయంలో మహాలక్ష్మమ్మ ఆన్లైన్ లో అర్జీ పెట్టుకుంది. దానిలో సాంకేతిక తప్పిదాలు ఉండడంతో మళ్లీ సవరించే దరఖాస్తు చేసుకోమని సచివాలయంలోని సదరు విభాగం అధికారులు స్పష్టం చేశారు.

అందుకు అనుగుణంగానే ఆమె దరఖాస్తు చేసుకోగా తాజాగా బాపట్ల జిల్లా కలెక్టర్ కు ఆమె దరఖాస్తు సంబంధించిన వివరాలను పంపించారు. ఈ క్రమంలోనే తాజాగా బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వృద్ధురాలితో తన కార్యాలయంలో ప్రమాణం చేయించారు. భారత రాజ్యాంగాన్ని గౌరవించడంతోపాటు అక్కడి చట్టాలకు లోబడి ఉంటాం అనేది ఆ ప్రమాణం యొక్క సారాంశంగా చెబుతున్నారు. ప్రమాణ ప్రతితో పాటు విచారణ నివేదికను కేంద్ర హోం శాఖకు నివేదిస్తామని కలెక్టర్ ఆమెకు వెల్లడించారు. అక్కడి నుంచి అమెరికా ఎంబసికి వివరాలను పంపించమన్నారు. అమెరికా పౌరసత్వం రద్దు కాగానే ఎక్కడి పౌరురాలిగా ఆమెకు పౌరుసత్వాన్ని అందించనున్నారు. ఇకపోతే మహాలక్ష్మమ్మ కుమారుడు గుంటూరులోని ఎన్నారై వైద్య కళాశాల డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు.

భారతదేశం పట్ల మక్కువతోనే..

మహాలక్ష్మమ్మకు భారతదేశం పట్ల ఎంతో మక్కువ. కుటుంబ సభ్యులు అమెరికాలో స్థిరపడడంతో వారితో పాటు అప్పట్లో వెళ్లారు. అమెరికా వెళ్లినప్పటికీ ఇక్కడికి వచ్చి చివరి శ్వాస విడిచాలన్నది ఆమె కోరిక. ఈ క్రమంలోనే స్వగ్రామంలో ఉంటున్న తన మరో కుమారుడికి తన కోరికను చెప్పారు. వెంటనే ఇక్కడి కుమారుడు కూడా అంగీకరించడంతోపాటు అక్కడి కుటుంబ సభ్యులు కూడా ఆమె కోరికను మన్నించారు. అందులో భాగంగానే 2018లో ఆమెను ఇండియాకు తిరిగి పంపించారు. సుమారు 8 ఏళ్ల పాటు భారత్లో నివాసం ఉంటేనే భారతీయ పౌరుషత్వం లభించేందుకు అవకాశం ఉంది. ఆ ఉద్దేశంతోనే ఆమె కొన్నాళ్లుగా భారత్ లోనే నివాసం ఉంటూ పౌరసత్వం పొందే ప్రక్రియను ప్రారంభించారు. 8 ఏళ్ల పీరియడ్ పూర్తి కావడంతో ఆమె తాజాగా దరఖాస్తు ప్రక్రియను ముందుకు అధికారులు పంపించారు. ఈ క్రమంలోనే జిల్లా కలెక్టర్ ఆమెను పిలిపించి ప్రమాణం చేయించారు. కొద్దిరోజుల్లోనే ఆమెకు భారతదేశ పౌరసత్వం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు