క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ కేసు వ్యవహారంపై సీఎం చంద్రబాబు నాయుడు స్ర్టాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ కేసులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న వ్యవహారంపై సీఎం తాజాగా స్పందించారు. ఈ కేసు విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై నోరు పారేసుకుంటే కబడ్ధార్ అంటూ ఆయన హెచ్చరికాలు జారీ చేశారు. సాయి కృష్ణ ఘటనకు కూడా కులం రంగం పులిమి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, అలాంటి విమర్శలకు తగిన సమాధానం చెప్పే శక్తి తమకు ఉందన్నారు. ఈ తరహా ఆరోపణలకు అడ్డుకట్ట పడకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. సంక్షేమంపై తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న చంద్రబాబు.. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా దాదాపు 11 వ ఏల మంది ఉద్యోగులను సీపీఎస్ నుంచి ఓపీఎస్‌లోకి తీసుకువచ్చి వారి జీవితాల్లో భరోసాను నింపినట్టు వెల్లడించారు.
ఐదేళ్లు విధ్వంస పాలనపై విమర్శలు..
వైసీపీ హయాంలో 2019 నుంచి 2024 మధ్య రాష్ట్రంలో విధ్వంస పాలన సాగించారని చంద్రబాబు నాయుడు విమర్శించారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపి అపచారం చేశారన్న ఆయన.. అలాంటి చర్యలకు పాల్పడిన వారిని ప్రజలు, భక్తులు ఎప్పటికీ క్షమించరని వ్యాఖ్యానించారు. స్వామి వారికి అపచారం జరిగితే బాధ్యుతలను శిక్షించాలా.? లేదా.? అనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు. ఇప్పుడు అదే వ్యక్తులు దేవాలయాలు చుట్టూ తిరుగుతూ భక్తి ప్రదర్శిస్తున్నారన్నారు. దేవుడిని నిజంగా విశ్వసించే ఏ వ్యక్తి కూడా అలాంటి చర్యలను సమర్థించరని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు మంచి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతిపక్షంగా ఉన్న గొడ్డలి పార్టీ రాష్ట్రంలో విషపూరిత రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. మెగా డీఎస్సీ పూర్తయిన ఏడాది తరవాత పేపర్ లీక్ జరిగిందని ఆరోపించడం విచిత్రమన్నారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమని వ్యాఖ్యానించారు. మంత్రి నారా లోకేష్ ఈ ఆరోపణలపై సవాల్ విసిరినా ప్రతిపక్ష నేతలు స్పందించలేదని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.