Homeసినిమాప్రభాస్‌తో నాగ్ అశ్విన్ ఫన్ ప్రమోషన్.. వైరల్‌గా మారిన వీడియో వెనుక కథ ఇదే!

ప్రభాస్‌తో నాగ్ అశ్విన్ ఫన్ ప్రమోషన్.. వైరల్‌గా మారిన వీడియో వెనుక కథ ఇదే!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : పాన్ ఇండియా దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా చేసిన ఓ ప్రమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా తన సినిమాల ప్రచారంలో కొత్తదనాన్ని చూపించే నాగ్ అశ్విన్, ఈసారి రెబల్ స్టార్ ప్రభాస్‌ను కూడా రంగంలోకి దింపడంతో అభిమానుల దృష్టి మొత్తం ఆ వీడియోపై పడింది. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన సింగ్ గీతం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నాగ్ అశ్విన్, ప్రభాస్ కలిసి చేసిన సరదా వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. సినిమాలోని ప్రత్యేకతను వివరిస్తూ నాగ్ అశ్విన్ మాట్లాడుతుండగా, ప్రభాస్ తనదైన కామెడీ టైమింగ్‌తో దర్శకుడిని ఆటపట్టించడం అభిమానులను ఆకట్టుకుంది.

 

ఇండియన్ సినిమా చరిత్రలో మాటల స్థానంలో పాటలతో కథ చెప్పిన తొలి సినిమా అని నాగ్ అశ్విన్ చెప్పగా, ఇంకా గట్టిగా చెప్పాలి అంటూ ప్రభాస్ సరదాగా స్పందించాడు. దీంతో నాగ్ అశ్విన్ మళ్లీ అదే విషయాన్ని మరింత ఉత్సాహంగా చెప్పడం వీడియోలో హైలైట్‌గా నిలిచింది. ఈ సన్నివేశాన్ని చూసిన నెటిజన్లు అనిల్ రావిపూడి తరహాలో వినూత్న ప్రమోషన్స్ చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. ఇక సింగ్ గీతం గురించి మాట్లాడిన సింగీతం శ్రీనివాసరావు, ఇది తన నాలుగు దశాబ్దాల కల అని తెలిపారు. ఆ కలను నిజం చేయడంలో నాగ్ అశ్విన్ కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. మాటల బదులు పాటల ద్వారా కథను చెప్పే ప్రయోగం భారతీయ సినీ చరిత్రలో అరుదైనదని పేర్కొన్నారు.

 

మరోవైపు కల్కి 2 పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ పాత్రలకు సంబంధించిన ముఖ్యమైన భాగాలు ఇప్పటికే పూర్తయ్యాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు, కల్కి ప్రపంచాన్ని మరింత విస్తరించే ఆలోచనలో నాగ్ అశ్విన్ ఉన్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. తొలి భాగంలో కనిపించిన కొన్ని కీలక పాత్రలపై ప్రత్యేక స్పిన్-ఆఫ్ ప్రాజెక్టులు లేదా ఓటీటీ కథలు రూపొందించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ పాత్రల నేపథ్య కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచన ఉన్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు