Homeతెలంగాణ‘రాంబో’ మూవీ పవర్‌ఫుల్ గ్లింప్స్ రిలీజ్..!

‘రాంబో’ మూవీ పవర్‌ఫుల్ గ్లింప్స్ రిలీజ్..!

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: యంగ్ ట్యాలెంటెడ్ శ్రీతేజ్ టైటిల్ పాత్రలో నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రాంబో’. రత్నాకరం అనిల్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని, హిడింబ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన నిర్మాత శ్రీధర్ గంగపట్నం, ఎస్‌వీకే సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన ‘రాంబో’ గ్లింప్స్ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెంచింది. “ఒక మృగం మనిషిగా పుడితే వాడే రాంబో” అనే పవర్‌ఫుల్ డైలాగ్‌తో ప్రారంభమైన గ్లింప్స్ వైల్డ్ యాక్షన్ తో ఆకట్టుకుంది.శ్రీతేజ్ ఇంటెన్స్, అగ్రెసివ్ బాడీ లాంగ్వేజ్‌తో పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారు.

Also Read:ఒకే కారులో ఇద్దరు మాజీ భార్యలు, కాబోయే భార్యతో అమీర్ ఖాన్.. నువ్వు మామూలోడివి కాదు మాస్టారూ!

ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో ఆయన చూపించిన వైల్డ్ ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ పాత్రను మరింత బలంగా నిలబెట్టాయి.దర్శకుడు రత్నాకరం అనిల్ రాజు రాంబో పాత్రను డిజైన్ చేసిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హీరో క్యారెక్టర్‌లోని వైల్డ్ ఎమోషన్స్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేశారు. స్టార్ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె. నాయుడు అందించిన విజువల్స్ గ్లింప్స్‌కు పర్ఫెక్ట్ లుక్ తీసుకొచ్చాయి. ప్రతి ఫ్రేమ్ కథలోని ఇంటన్సిటీ మరింత బలంగా కనిపించింది. సునీల్ కశ్యప్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ బ్లాక్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ గ్లింప్స్‌ను మరింత షార్ప్‌గా, గ్రిప్పింగ్‌గా మలిచింది.

Also Read:Vaibhav Suryavansh: దంబుల్లా మ్యాచ్ లో కొట్లాట.. వైభవ్‌ కు బీసీసీఐ షాక్!

మొత్తంగా, ‘రాంబో’ గ్లింప్స్ ఒక రా, వైల్డ్, పవర్‌ఫుల్ యాక్షన్ ఎక్స్‌పీరియన్స్‌కు హామీ ఇస్తూ, సినిమాపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచింది. శ్రీతేజ్, రాజీవ్ సాలూరి, ఫర్నాజ్ శెట్టి, మైమ్ గోపీ, ఎం.ఎస్.ఆర్. మధుసూధనరావు, నీలిమ పాఠకంశెట్టి, ప్రసన్న కుమార్, కోటేశ్వరరావు, మిర్చి శ్రీనివాసరావు, రంగధామ్, మీర్, శ్రద్ధ, రమ్య (చిన్ని), ఉమా రేచర్ల, మేఘన తోట, శ్రావణి, జె. లక్ష్మి (చిట్టి) త‌దిత‌రులు న‌టించారు.

Also Read:PM Kisan Update: రైతుల ఖాతాల్లో మళ్లీ పీఎం కిసాన్ నగదు.. ఎప్పుడు వేస్తారంటే?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు