Homeలైఫ్ స్టైల్రోజంతా ఫోన్ ఛార్జ్ అయిపోతుందని టెన్షన్‌ పడుతున్నారా… ఈ సింపుల్ ట్రిక్స్‌తో బ్యాటరీ లైఫ్ డబుల్!

రోజంతా ఫోన్ ఛార్జ్ అయిపోతుందని టెన్షన్‌ పడుతున్నారా… ఈ సింపుల్ ట్రిక్స్‌తో బ్యాటరీ లైఫ్ డబుల్!

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు మన రోజువారీ జీవితంలో విడదీయరాని భాగం అయిపోయింది. కానీ ఎంత అడ్వాన్స్‌డ్ ఫోన్ అయినా ఒక సమస్య మాత్రం చాలా మందిని ఇబ్బంది పెడుతోంది .. బ్యాటరీ త్వరగా ఖాళీ కావడం. రోజంతా ఛార్జర్ కోసం వెతకాల్సిన పరిస్థితి చాలా మందికి అసహనంగా ఉంటుంది. అయితే చిన్న చిన్న సెట్టింగ్స్ మార్చడం ద్వారా మీ ఫోన్ బ్యాటరీ పనితీరును గణనీయంగా పెంచుకోవచ్చు.

ముందుగా స్క్రీన్ సెట్టింగ్స్‌పై దృష్టి పెట్టాలి. ఫోన్‌లో ఎక్కువ పవర్‌ను వినియోగించే భాగం స్క్రీన్. కాబట్టి బ్రైట్‌నెస్‌ను అవసరానికి తగ్గట్టుగా ఉంచడం మంచిది. అలాగే డార్క్ మోడ్ లేదా నైట్ మోడ్‌ను ఆన్ చేస్తే బ్యాటరీ వినియోగం తగ్గడమే కాకుండా కళ్లకు కూడా ఉపశమనం లభిస్తుంది.
ఇక మరో ముఖ్యమైన అంశం రిఫ్రెష్ రేట్. రిఫ్రెష్ రేట్ వల్ల స్క్రోలింగ్ స్మూత్‌గా కనిపించినా, అది బ్యాటరీపై ప్రభావం చూపుతుంది. కాబట్టి రోజువారీ సాధారణ వినియోగానికి తక్కువ రిఫ్రెష్ రేట్‌ను ఎంచుకోవడం ద్వారా బ్యాటరీని సేవ్ చేసుకోవచ్చు.

యాప్‌ల వినియోగం కూడా కీలకం. మనకు తెలియకుండా కొన్ని యాప్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తూ బ్యాటరీని ఖర్చు చేస్తుంటాయి. కాబట్టి సెట్టింగ్స్‌లోకి వెళ్లి బ్యాటరీ వినియోగాన్ని పరిశీలించడం, అవసరం లేని యాప్‌లను తొలగించడం మంచిది. ప్రయాణాల్లో లేదా నెట్ అవసరం లేని సమయంలో ఫ్లైట్ మోడ్ ఉపయోగించడం కూడా మంచి అలవాటు. ఈ మోడ్‌లో ఫోన్ సిగ్నల్ కోసం శోధించదు, అందువల్ల బ్యాటరీ ఎక్కువసేపు నిల్వ ఉంటుంది. ఈ చిన్న మార్పులు మీ ఫోన్ బ్యాటరీ లైఫ్‌ను పెంచడమే కాకుండా, ఫోన్ పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. ఇక నుంచి ఛార్జర్ కోసం పరుగులు తీయాల్సిన అవసరం తగ్గుతుంది!

also read: విశాఖ బీచ్‌లో ఇక చిల్‌ అవ్వాల్సిందే.. బీచ్‌ సాక్స్‌ ఏర్పాటుకు నిర్ణయం.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు