Homeక్రైమ్'ఉస్మానియా'లో ర్యాగింగ్...12 మంది సస్పెండ్...!

‘ఉస్మానియా’లో ర్యాగింగ్…12 మంది సస్పెండ్…!

  • ‘ఉస్మానియా’లో ర్యాగింగ్…!

  • 12 మంది విద్యార్థులపై పోలీస్ కేసు

  • ఆరు నెలల పాటు సస్పెండ్

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ తీవ్ర కలకలం రేపింది. బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను.. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ర్యాగింగ్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.

ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సంజీవ్ సింగ్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 12 మంది బీడీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థులపై తెలంగాణ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ చట్టం కింద సుల్తాన్ బజార్ పోలీసులు కేసులు నమోదు చేశారు.

Also Read: రేవంత్ రెడ్డి వి చిల్లర వేషాలు…కల్వకుంట్ల కవిత – Crime Mirror

ర్యాగింగ్ ఘటనను ఉస్మానియా మెడికల్ కాలేజీ తీవ్రంగా పరిగణించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫైనల్ ఇయర్ విద్యార్థులను ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

  • ర్యాగింగ్ నిషేధం..

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థల్లో ర్యాగింగ్ పూర్తిగా నిషేధం. కానీ అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. కఠిన చట్టాలు, చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొంతమంది విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికీ ర్యాగింగ్ భూతం అనేది చాలా చోట్ల జరుగుతూనే ఉంది.

Also Read: Breaking: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ వెనుక ఉన్నది వాళ్లేనా…? – Crime Mirror

కానీ వెలుగులోకి రావడం లేదు. కాలేజీ యాజమాన్యాలు ర్యాగింగ్ భూతాన్ని కట్టడి చేసేందుకు కఠిన చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. తాజా ఘటన నేపథ్యంలో ఉస్మానియా మెడికల్ కాలేజీ యాజమాన్యం యాంటీ ర్యాగింగ్ కమిటీని మరింత స్ట్రాంగ్ గా చేసినట్లు స్పష్టం చేసింది.

ఎవరైనా విద్యార్థులు ర్యాగింగ్ పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ప్రిన్సిపల్ సంజీవ్ సింగ్ యాదవ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ర్యాగింగ్ ఘటన నేపథ్యంలో జూనియర్ విద్యార్థులు ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.

  • గత ఏడాది ఒకరి ఆత్మహత్య

గత ఏడాది సెప్టెంబర్ లో ర్యాగింగ్ భూతానికి ఒక బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. నారపల్లి లోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్న రెండో సంవత్సరం విద్యార్థి అక్కడే హాస్టల్లో ఉంటున్నాడు. అయితే సీనియర్ విద్యార్థులు రాగింగ్ కు పాల్పడ్డారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

Also Read: డీఎస్సీ పై చర్చిద్దాం రా!.. జగన్మోహన్ రెడ్డికి నారా లోకేష్ సవాల్!! – Crime Mirror

అప్పట్లో ఆ ఘటన సంచలనంగా మారింది. అయితే తెలంగాణ వ్యాప్తంగా అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే కఠిన ఆంక్షలు. కేసులు పెడుతున్నా ర్యాగింగ్ అదుపులోకి రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై విద్యార్థుల్లో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడితే బాగుంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Also Read: ప్రాణం తీసిన పంట‌…కొనుగోలు కేంద్రంలో రైతు ఆత్మహత్య…! – Crime Mirror

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు