Crime Mirror, Cinema Updates: టాలీవుడ్లో వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈసారి విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌లతో మల్టీస్టారర్ మూవీని తెరకెక్కించనున్న ఆయన, ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు పెంచేశారు.
ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనిల్ రావిపూడి ఈ సినిమా ఓపెనింగ్ జూన్ 18న జరగనుందని, జూన్ 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. అంతేకాకుండా వచ్చే సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు.
Also Read: దగ్గు సిరప్‌లపై కేంద్రం కఠిన నిర్ణయం.. ఇక ఎవ్వరికి దొరకనట్టే…! – Crime Mirror
ఇదిలా ఉండగా, ఈ సినిమాలో హీరోయిన్ల ఎంపికకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో జరిగిన ఓ సినిమా ఈవెంట్లో కృతి శెట్టిని తన తదుపరి చిత్రంలో తీసుకుంటానని అనిల్ రావిపూడి స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి నటించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
మరోవైపు వెంకటేష్‌కు జోడీగా జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్‌ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆమెకు కథ వినిపించగా, ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ జోడీ గతంలో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో, మరోసారి వీరిద్దరూ కలిసి నటిస్తే మంచి స్పందన వచ్చే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.
Also Read: ఈ నెల 21 నుంచి మీనాక్షి నటరాజన్ పలు నియోజకవర్గాల్లో పర్యటన… – Crime Mirror
అయితే కీర్తి సురేష్, కృతి శెట్టి ఎంపికపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రేపు జరగనున్న సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశముందని సమాచారం.
ఫ్యామిలీ ఎంటర్టైనర్స్కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన అనిల్ రావిపూడి, వెంకటేష్ కామెడీ టైమింగ్, కళ్యాణ్ రామ్ మాస్ ఇమేజ్ను కలిపి ఈ చిత్రాన్ని వినోదాత్మకంగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ మల్టీస్టారర్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది.
Also Read: పవన్ కొండంత అభిమానం.. మనసుకు హత్తుకుని ఆత్మీయత పంచిన వైనం!! – Crime Mirror
Also Read: ప్రభుత్వ స్కూల్లో పిల్లలను చేర్పిస్తే ఇంటి పన్ను, నల్లా బిల్లు పూర్తిగా మాఫీ.. – Crime Mirror