Homeఅంతర్జాతీయంఅన్నా డీఎంకే కు నటి గౌతమి గుడ్ బై...!

అన్నా డీఎంకే కు నటి గౌతమి గుడ్ బై…!

  • పార్టీ ప్రాథమిక సభ్యత్వం తో పాటు పదవులకు రాజీనామా

  • త్వరలో విజయ్ టీవీ కే పార్టీలోకి…

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: అన్నా డీఎంకేకు ప్రముఖ నటి గౌతమి గుడ్ బై చెప్పారు. ఈరోజు ఆమె తన రాజీనామాను ప్రకటించారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షుడు ఎడిప్పాడి పలని స్వామికి పంపించారు. మూడేళ్ల కిందట ఆమె అన్నా డీఎంకే లో చేరారు.

అయితే ఇప్పుడు ఉన్నఫలంగా ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనివార్యsen పరిస్థితుల్లోనే తాను పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. సమాజ సేవ కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.

  • సీనియర్ నటి..

గౌతమి సీనియర్ నటి. తమిళంలో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. దక్షిణాది భాషలతో పాటు హిందీ చిత్రాల్లో కూడా నటించారు. ఆమె భారతీయ జనతా పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి సుదీర్ఘకాలం ఆ పార్టీలో పని చేశారు. 2023 లో బిజెపికి గుడ్ బై చెప్పి అన్నాడీఎంకే లో చేరారు. బిజెపిలో తగినంత ప్రోత్సాహం లేకపోవడం, ఆశించిన స్థాయిలో పదవులు దక్కకపోవడంతో అప్పట్లో ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.

Also Read: బొగ్గు చోరీ సాధ్యమేనా…? – Crime Mirror

2023లో అన్నా డీఎంకే లో చేరారు. ఆ పార్టీలో వివిధ హోదాల్లో పని చేశారు. మొన్నటి ఎన్నికల్లో ఆమె టికెట్ ఆశించారు. కానీ వివిధ సమీకరణలో భాగంగా ఆమెకు ఛాన్స్ దక్కలేదు. ఇప్పుడు ఎన్నికల్లో అన్నా డిఎంకె ఓడిపోవడంతో ఆ పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు.

  • టీవీకే నుంచి ఆహ్వానం..

అయితే గౌతమి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెకు ప్రత్యేక ఆహ్వానం అందినట్లు సమాచారం. పార్టీలో చేరితే సముచిత స్థానంతో పాటు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పిస్తామని విజయ్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అందుకే గౌతమి అన్నా డీఎంకేకు గుడ్ బై చెప్పి.. త్వరలో టీవీ కే కండువా కప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.. అసలే మొన్నటి ఎన్నికల్లో ఓటమితో అన్నా డీఎంకే లో నిరాశ అలుముకుంది. ఇప్పుడు మంచి ఇమేజ్ ఉన్న గౌతమి లాంటి నటి పార్టీకి గుడ్ బై చెప్పడం భారతీయ జనతా పార్టీకి లోటు.

Also Read: ఏపీకి కేంద్రం నుంచి మరో ప్రాజెక్టు.. ఎన్‌సీసీ డైరెక్టరేట్‌ మంజూరు – Crime Mirror

Also Read: Tirumala Laddu Update: తిరుమల లడ్డూపై టీటీడీ కీలక నిర్ణయం..! – Crime Mirror

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు