Homeలైఫ్ స్టైల్చల్లగా ఉంటాయని తాగుతున్నారా..? మీ ఆరోగ్యానికి ప్రమాదమే...!

చల్లగా ఉంటాయని తాగుతున్నారా..? మీ ఆరోగ్యానికి ప్రమాదమే…!

  • చల్లగా ఉంటాయని తాగుతున్నారా..?

  • ఈ డ్రింక్స్ మీ ఆరోగ్యానికి ప్రమాదమే…!

Crime Mirror, Health Updates: వేసవి కాలంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో శరీరాన్ని చల్ల బరుచుకోవడానికి చాలా మంది చల్లటి పానీయాల వైపు మొగ్గు చూపుతారు. బయట నుంచి ఇంటికి వచ్చిన వెంటనే ఫ్రిజ్‌లో ఉన్న నీళ్లు, కూల్ డ్రింక్స్ లేదా ఇతర చల్లటి పానీయాలు తాగడం సాధారణమే.

Also Read: అమెరికాలో ఘోర ప్రమాదం: మిస్సోరీలో స్కైడైవింగ్ ప్లేన్ కుప్పకూలి 12 మంది మృతి

అయితే చల్లగా ఉన్న ప్రతి పానీయం ఆరోగ్యానికి మంచిదే అనుకోవడం పొరపాటు అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని పానీయాలు తాత్కాలిక ఉపశమనం ఇచ్చినా, దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఐస్ వాటర్‌

ఎండలో నుంచి వచ్చాక ఐస్ చల్లటి నీళ్లు తాగితే వెంటనే ఉపశమనం లభించినట్లు అనిపిస్తుంది. కానీ అతి చల్లటి నీరు శరీర ఉష్ణోగ్రతపై ప్రభావం చూపుతుంది. ఇది రక్తనాళాలను కుంచించివేసి రక్తప్రసరణను తాత్కాలికంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది.

Also Read: బుచ్చిబాబుతో మెగాస్టార్ రెడీ.. కానీ ఒక్క కండీషన్…!

అలాగే జీర్ణవ్యవస్థ పనితీరుపైనా ప్రతికూల ప్రభావం చూపవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.

ఎనర్జీ డ్రింక్స్, కూల్ డ్రింక్స్‌

వేసవిలో అలసటను తగ్గించుకోవడానికి కొందరు ఎనర్జీ డ్రింక్స్ తాగుతుంటారు. అయితే వీటిలో అధిక స్థాయిలో కెఫీన్, చక్కెర ఉండటం వల్ల శరీరానికి మేలు కంటే హానీ ఎక్కువ. గుండె వేగం పెరగడం, రక్తపోటు పెరగడం, ఆందోళన వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

అలాగే కూల్ డ్రింక్స్‌లో ఉండే అధిక చక్కెర, ఫ్రుక్టోజ్ శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు దారితీయవచ్చు. తరచూ వీటిని తీసుకోవడం వల్ల ఊబకాయం, దంత సమస్యలు, ఎముకల బలహీనత వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Also Read: న్యూజిలాండ్‌లో భారత్ బోణీ.. అమెరికాపై కమ్‌బ్యాక్ విజయం!

ప్యాక్డ్ జ్యూసులు

పండ్ల రసాల పేరుతో మార్కెట్లో లభించే అనేక ప్యాక్డ్ జ్యూసుల్లో అధిక చక్కెర, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడమే కాకుండా, శరీరంలో అనవసర కేలరీలను పెంచుతాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు వీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.

ఎండలో ఆల్కహాల్

వేసవి కాలంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరం త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఇది శరీరంలోని నీటిని వేగంగా బయటకు పంపిస్తుంది. ఫలితంగా హీట్ స్ట్రోక్, తలనొప్పి, తలతిరగడం, అలసట వంటి సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే ఎండాకాలంలో ఆల్కహాల్‌కు పూర్తిగా దూరంగా ఉండటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే సహజ పానీయాలు, కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. శరీరానికి తగినంత నీరు అందించడం ద్వారా ఎండల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.

Also Read: బాలయ్య కొత్త సినిమా.. సీఎం చంద్రబాబు క్లాప్…!

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు