Homeవైరల్పెద్ది ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్...!

పెద్ది ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్…!

  • పెద్ది ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్…!

  • ఆ రోజు నుంచి థియేటర్లలో కొత్త సీన్స్…!

Crime Mirror, Cinema Updates: రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.378 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఇప్పుడు మరింత నిడివితో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. సినిమా నుంచి తొలగించిన కొన్ని కీలక సన్నివేశాలను తిరిగి థియేటర్లలో జోడిస్తున్నట్లు దర్శకుడు బుచ్చిబాబు అధికారికంగా ప్రకటించారు.

ఆదివారం నిర్వహించిన సక్సెస్ మీట్‌లో బుచ్చిబాబు మాట్లాడుతూ.. అభిమానులు మిస్ అయిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను మళ్లీ సినిమాకు జోడించామని వెల్లడించారు. ఇప్పటికే ఎడిటింగ్ పనులు పూర్తయ్యాయని, ఈ బుధవారం నుంచి కొత్త వెర్షన్ థియేటర్లలో ప్రదర్శించబడుతుందని తెలిపారు.

Also Read: బుచ్చిబాబుతో మెగాస్టార్ రెడీ.. కానీ ఒక్క కండీషన్…!

మొత్తం మూడు కొత్త సన్నివేశాలను యాడ్ చేసినట్లు బుచ్చిబాబు చెప్పారు. ఇందులో రెండు సన్నివేశాలు జాన్వీ కపూర్ పోషించిన అచ్చియమ్మ పాత్రకు సంబంధించినవి కాగా, మరో సన్నివేశం జగపతిబాబు పాత్రకు సంబంధించినదని వివరించారు. కథలోని కొన్ని భావోద్వేగ క్షణాలు, పాత్రల మధ్య బాండింగ్‌ను మరింత బలంగా చూపించే విధంగా ఈ సీన్స్ ఉంటాయని సమాచారం.

ఇటీవల జగపతిబాబు కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమాలో చాలా మంచి సన్నివేశాలు ఎడిటింగ్‌లో తొలగించబడ్డాయని, అవి ఓటీటీ వెర్షన్‌లో కనిపిస్తాయని చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వాటిలో కొన్ని సన్నివేశాలను ముందుగానే థియేటర్లలోనే చూపించాలని మేకర్స్ నిర్ణయించారు.

Also Read: Sreemukhi Remuneration: శ్రీముఖి సంపాదన తెలిస్తే షాక్ అవడం ఖాయం…!

ఇక అచ్చియమ్మ పాత్ర చిత్రీకరణపై వచ్చిన విమర్శల గురించి కూడా బుచ్చిబాబు స్పందించారు. సినిమా విడుదలైన తర్వాత ఎక్కువ మంది ప్రేక్షకులు చిత్రాన్ని, రామ్ చరణ్ నటనను ప్రశంసించారని అన్నారు. కొంతమంది మాత్రమే ఇతర అంశాలపై చర్చించారని పేర్కొన్నారు.

ఎక్కడ పెళ్లి జరిగినా ఎవరో ఒకరు వచ్చి ఇది బాగోలేదు, అది బాగోలేదు అంటారు. అలాంటి విమర్శలు సహజం. కానీ 95 శాతం మంది ప్రేక్షకులు సినిమాను ఆదరించారు అని బుచ్చిబాబు వ్యాఖ్యానించారు.

Also Read: న్యూజిలాండ్‌లో భారత్ బోణీ.. అమెరికాపై కమ్‌బ్యాక్ విజయం!

మొత్తానికి ఇప్పటికే విజయవంతంగా దూసుకుపోతున్న పెద్ది.. ఇప్పుడు కొత్త సన్నివేశాలతో ప్రేక్షకులకు మరోసారి థియేటర్లకు రావాలనే ఆసక్తిని పెంచుతోంది. అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ అదనపు సన్నివేశాలు సినిమాకు మరింత బలం చేకూరుస్తాయా లేదా అనేది చూడాలి.

Also Read: బాలయ్య కొత్త సినిమా.. సీఎం చంద్రబాబు క్లాప్…!

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు