క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: ఏపీ రాజకీయ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి కనిపిస్తూ తరచూ వార్తల్లో నిలిచే దివ్వల మాధురి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, బిగ్‌బాస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు.
ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న దివ్వల మాధురి, అనంతరం ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో దువ్వాడ శ్రీనివాస్ మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తారని, తాను ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే తెలంగాణ నుంచే బరిలోకి దిగుతానని వెల్లడించారు.
తెలంగాణలో ఇప్పటికే తనకు కొన్ని రాజకీయ ఆఫర్లు వచ్చాయని చెప్పిన మాధురి, ప్రస్తుతం వాటి గురించి పూర్తి వివరాలు వెల్లడించలేనని అన్నారు. అధికారికంగా ఏదైనా పార్టీలో చేరిన తర్వాతే అన్ని విషయాలను మీడియా ముందుకు వచ్చి చెబుతానని స్పష్టం చేశారు.
అలాగే తెలంగాణ రాజకీయాలు తనకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం సినిమాలు, వ్యాపారం, సోషల్ మీడియా కార్యక్రమాలతో బిజీగా ఉన్నప్పటికీ రాజకీయాలపై కూడా దృష్టి పెట్టినట్లు ఆమె వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది.
దివ్వల మాధురి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమెకు ఆఫర్ ఇచ్చిన పార్టీ ఏది? తెలంగాణలో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది? అనే అంశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
మరి వచ్చే ఎన్నికల నాటికి దివ్వల మాధురి నిజంగానే రాజకీయ రంగప్రవేశం చేస్తారా? చేస్తే ఏ పార్టీ తరఫున బరిలోకి దిగుతారు? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మాత్రం ఆమె చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.