క్రైమ్ మిర్రర్, జాతీయం:- దేశంలో పేద మధ్యతరగతి ప్రజల వైద్య ఖర్చులు గణనీయంగా పెరుగుతున్నాయి.. ఏటా వైద్య సేవల కోసం లక్షల కోట్ల రూపాయలను ప్రజలు ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాల నెలవారి బడ్జెట్ను వైద్య ఖర్చులు అతలాకుతలం చేస్తున్నాయి. ఆసుపత్రుల్లో చేరే చికిత్సలు పొందేందుకు బెడ్ చార్జీలు ఆపరేషన్లు ఐసియు ఖర్చుల రూపంలో ప్రజలు పేట లక్షల కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నారు. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన నేషనల్ హెల్త్ అకౌంట్స్ 2022-23 నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. దేశంలోనే ప్రజలు వివిధ రకాల అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల్లో చేరి మందుల కోసమే ఏకంగా రూ.1.6 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు ఈ నివేదిక వెల్లడించింది. ఇందులో వైద్యులు సూచించిన మందులపై ఖర్చు ఒకటి పాయింట్ మూడు లక్షల కోట్లు కాగా నేరుగా మెడికల్ షాపు నుంచి కొన్న ఔషధాలు ఖర్చు 26,670 కోట్లుగా పేర్కొంది. సాధారణ ఓపి సేవలు కోసం ఒకటి పాయింట్ నాలుగు లక్షల కోట్ల వ్యయం అయినట్లు ఈ నివేదిక పేర్కొంది. ఇక ఆసుపత్రుల అడ్మిషన్లు మందులు ఓపిడి విభాగాలే అధికం ఈ దేశం మొత్తం మీద వైద్య ఆరోగ్య సంరక్షణ కోసం జరిపే ఖర్చులు అత్యధికంగా 77.3 శాతాన్ని కలిగి ఉండడం గమనార్హం. గత దశాబ్ద కాలంలో ప్రజలు తమ జేబులు నుంచి పెట్టే వైద్య ఖర్చుల శాతం క్రమంగా తగ్గుతూ వస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మందులు ధరల సామాన్యులకు భారంగా మారాయని ఆరోగ్య నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతూ వస్తున్న మందులు ధరల కారణంగా సాధారణ మధ్యతరగతి ప్రజలకు మందులు తీసుకోవాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది ప్రతినెల వేలాది రూపాయలు కొన్ని రకాల దీర్ఘకాలక వ్యాధుల కోసం మందులు వినియోగించాల్సిన పరిస్థితి నేపథ్యంలో ఆర్థిక భారం ఆయా కుటుంబాలపై పడుతోంది.
అనేక అంశాల్లో భారీగా పెరుగుదల..
దేశంలో ప్రజలు వైద్య సేవల కోసం మందులు కోసం వెచ్చిస్తున్న ఖర్చులు గణనీయంగా పెరిగిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మందులు ధరలు పెరగడంతో సాధారణ మధ్యతరగతి ప్రజలపై భారం పెరుగుతోంది. ఏటా ప్రజలు మందుల కోసం లక్షల కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. అయితే ఆరోగ్యానికి సంబంధించి ప్రజల్లో పెరుగుతున్న ప్రాధాన్యత నేపథ్యంలో కొన్ని విషయాల్లో మెరుగుదల కనిపిస్తోంది. పిల్లల ఆరోగ్యానికి సంబంధించి, పోషకాహారానికి సంబంధించి ప్రజల్లో అవగాహన పెరగడంతో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. తాజా సర్వే ప్రకారం 12 నుంచి 23 నెలల వయసు ఉన్న పిల్లల్లో పూర్తిస్థాయి టీకాల పొందిన వారి శాతం గతంలో 83% ఉండగా ఇప్పుడు 87% పెరిగింది. ఐదేళ్లలోపు పిల్లల్లో ఎరుగుదల లోపం 35.4% నుంచి 29.3 శాతానికి తగ్గింది. పోషకాహార లోపంతో బాధపడే వారి శాతం 7.7% నుంచి 5.2 శాతానికి పడిపోయింది. శిశువులకు తల్లిపాలు అందించే విధానంలో మార్పు వచ్చింది. పుట్టిన గంటలోపు తల్లిపాలు అందించే శాతం 41.8% నుంచి 51.1 శాతానికి పెరిగింది 6 నుంచి 8 నెలల వయసు ఉన్న పిల్లలకు పాలతోపాటు అదనపు పోషకాహారాలను అందించే ప్రక్రియ 45.5 శాతం నుంచి 59.5 శాతానికి పెరిగింది.