క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ట్రోఫీ దక్కించుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ పై విజయం సాధించడం ద్వారా ఆర్సిబి కప్పు రెండోసారి దక్కించుకుంది. ఐపీఎల్ ఫైనల్ లో ఓటమి నిరాశతో ఉన్న గుజరాత్ జట్టుకు పెను ప్రమాదం తప్పింది. ఫైనల్ మ్యాచ్ తర్వాత అహ్మదాబాద్ స్టేడియం నుంచి హోటల్ కు వెళుతున్న సమయంలో టైటాన్స్ ఆటగాళ్లు ప్రయాణిస్తున్న బస్సులో ప్రమాదం చోటుచేసుకుంది. హోటల్ కు కొద్ది క్షణాల్లో చేరుకుంటారు అనుకునే సమయానికి బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఒక్కసారిగా ఆటగాళ్లు భయాందోళన చెందారు. మంటలు చెలరేగిన విషయాన్ని గుర్తించిన ప్లేయర్లు, సహాయక సిబ్బంది బస్సులో నుంచి వెంటనే దిగిపోయారు. దీంతో ఆటగాళ్లకు పెను ప్రమాదం తప్పినట్టు అయింది. ఆటగాళ్లు సకాలంలో బస్సులో నుంచి దిగిపోవడంతో అంతా సురక్షితంగా బయటపడ్డారు.
షార్ట్ సర్క్యూట్ తో మంటలు..
గుజరాత్ ఆటగాళ్లు ప్రయాణిస్తున్న బస్సులు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు వ్యాపించినట్లు చెబుతున్నారు. మంటలు రేగిన వెంటనే ఆటగాళ్లు విషయాన్నీ గుర్తించి అప్రమత్తమయ్యారు. వెంటనే బస్సులో నుంచి కిందకు దిగిపోయి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అయితే బస్సులోని ఈ విషయాన్ని గుర్తించి వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే బస్సులో కొంత ప్రమాదం చోటు చేసుకోవడంతో మరో బస్సు ఏర్పాటు చేశారు. అయితే బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా కిందకు దిగిపోయిన జట్టు సభ్యులు సుమారు గంటసేపు బయటే వేచి ఉండాల్సి వచ్చింది. ప్రత్యామ్నాయంగా ఏర్పాటుచేసిన బస్సు రావడానికి కొంత సమయం పట్టడంతో రోడ్డుపైనే గుజరాత్ జట్టు ఆటగాళ్లు, ఇతర సభ్యులు నిరీక్షించాల్సి వచ్చింది. మరో బస్సు వచ్చిన తర్వాత ప్లేయర్లను హోటల్ కు క్షేమంగా తరలించారు. ఈ ఘటన ఆటగాళ్లను ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. అప్పటికే మ్యాచ్ ఓడిపోయి దుఃఖంలో ఉన్న గుజరాత్ ఆటగాళ్లకు ఈ ఘటన మరోసారి తీవ్రమైన ఒత్తిడికి గురిచేసింది. భయాందోళన చెందిన ఆటగాళ్లు పరుగున బయటికి వచ్చారు. అయితే చిన్న ప్రమాదమే కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇదెలా ఉంటే ఐపీఎల్ ఫైనల్ పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు గుజరాత్ టైటాన్స్ పై ఐదు వికెట్లు తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. టాస్ఓడి తొలిత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 8 వికెట్ల నష్టానికి 1505 పరుగులు మాత్రమే చేసింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సిబి జట్టు 18 ఓవర్ లోనే ఆట ముగించి వరుసుగా రెండోసారి ట్రోపీని దక్కించుకుంది. ఫైనల్లో ఓటమి తర్వాత తీవ్ర బాధతో హోటల్‌కు బయలుదేరిన గుజరాత్ జట్టు ఆటగాలను ఈ ప్రమాదం మరింత ఒత్తిడికి గురిచేసింది. అయితే ఈ ప్రమాద ఘటనలో ఎవరికి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంలో గుజరాత్ ఆటగాళ్లు క్షేమంగా ఉన్నారని, భయపడాల్సిన అవసరం లేదని గుజరాత్ జట్టు యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.