క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- దేశంలో ఇంటర్నెట్ వినియోగంలో విప్లవాత్మక మార్పులకు నాందిగా నిలిచిన జియో మరో సరికొత్త రికార్డును సృష్టించింది. రిలయన్స్ సంస్థకు చెందిన జియోకు కోట్లాదిమంది సబ్స్క్రైబర్లను సొంతం చేసుకుని సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కోట్లాదిమంది రిలయన్స్ జియో వినియోగిస్తున్నారు. ఈ సంఖ్య గడిచిన కొన్నాళ్లుగా ఏటా లక్షలాదిగా తిరుగుతూ ఇప్పుడు కోట్లాదిమందికి చేరుకుంది. తాజాగా జియో సబ్ స్క్రైబర్ల సంఖ్య 52.40 కోట్లు దాటిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. ఈ ప్రకటనతో జియో కంపెనీ సరికొత్త రికార్డులను సృష్టించినట్టు అయింది. రిలయన్స్ కంపెనీ విడుదల చేసిన 2026 ఆర్థిక సంవత్సరం క్యూ4 రిపోర్ట్ ప్రకారం దేశవ్యాప్తంగా ప్రస్తుతం 26.8 కోట్ల మంది 5G యూజర్లు ఉన్నారు. ఫిక్స్డ్ బ్రాడ్ బ్యాండ్ ద్వారా 2.71 కోట్ల ఇళ్లకు జియో చేరువైంది. కాగా, ప్రతి యూజర్ నుండి సగటున నెలకు రూ.214 ఆదాయం వస్తుండగా, ఒక్కొక్కరు నెలకు సగటున 42.3GB డేటాను వినియోగిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. తాజా గణాంకాలతో దేశంలో అత్యధిక మంది వినియోగిస్తున్న నెట్వర్గ జియో సంస్థ నిలిచింది.
భవిష్యత్తులో మరిన్ని రికార్డులు అధిగమించే అవకాశం..
ప్రస్తుతం దేశంలో అత్యధిక మంది వినియోగదారులు జియో వినియోగిస్తున్నారు. ప్రస్తుతం అన్ని నెట్వర్క్లతో పోలిస్తే జియోకే అత్యధిక సంఖ్యలో వినియోగదారులు ఉన్నారు. ఈ సంఖ్య భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని తాజా గణాంకాలను చూస్తే అర్థమవుతుంది. ఒకప్పుడు స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య తక్కువగా ఉండడంతో జియో వినియోగదారుల సంఖ్య తక్కువగా ఉండేది. ప్రస్తుతం స్మార్ట్ఫోన్ వినియోగిస్తున్న ప్రతి ముగ్గురిలో ఒకరు జియో నెట్వర్క్ వినియోగిస్తుండడం ఈ రికార్డులకు కారణంగా కనిపిస్తోంది. అత్యధిక మంది వినియోగదారులు జియో నెట్వర్కు ప్రాధాన్యం ఇస్తుండడంతో ఈ సంస్థ రోజుకు బలోపేతం అవుతుంది. రానున్న రోజుల్లో జియో వినియోగదారుల సంఖ్య 60 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని ఈ సంస్థ అంచనా వేస్తోంది. ప్రస్తుతం వస్తున్న ఆదాయం కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇకపోతే జియో రీఛార్జ్ మొత్తాన్ని ఎప్పటికప్పుడు ఆ సంస్థ పెంచుతున్నప్పటికీ వినియోగదారుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.