Homeరాజకీయంనాలుగు రాష్ట్రాలకు అధ్యక్షులను నియమించిన బిజెపి.. కారణం అదేనా.?

నాలుగు రాష్ట్రాలకు అధ్యక్షులను నియమించిన బిజెపి.. కారణం అదేనా.?

క్రైమ్ మిర్రర్, పాలిటిక్స్:- దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్న భారతీయ జనతా పార్టీ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను నియమించింది. తాజాగా పార్టీ అధ్యక్షులను నియమించిన జాబితాలో పంజాబ్, హర్యానా, ఢిల్లీ, త్రిపుర రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను బిజెపి అగ్రనాయకత్వం నియమించింది. బిజెపి ఢిల్లీ అధ్యక్షుడిగా కేంద్రమంత్రి హర్ష మల్హోత్రాను బిజెపి అధిష్టానం నియమించింది. పంజాబ్ అధ్యక్షుడుగా సీనియర్ నాయకుడు కేవల్ సింగ్ దిల్లాన్ కు పార్టీ బాధ్యతలను అప్పగించిందే. హర్యానా పార్టీ అధ్యక్షురాలుగా అర్చనా గుప్తాను, త్రిపుర బిజెపి అధ్యక్షుడిగా అభిషేక్ దేబ్ రాయ్ ను నేనిస్తూ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. తొలిసారి ఎంపీ అయిన హార్స్ మల్హోత్రాకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్ర మంత్రి పదవిని ఇచ్చింది. ప్రస్తుతం ఆయన కేంద్ర కార్పొరేట్ వ్యవహారాలు, రోడ్డు రవాణా శాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. తూర్పు ఢిల్లీ నియోజకవర్గానికి హర్షమల్హోత్రా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దేశ రాజధానిలో బిజెపిని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు మలహోత్రాలను కేంద్రం అధ్యక్షుడుగా ప్రకటించింది.

పంజాబ్ లో అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా..

పంజాబ్ రాష్ట్రంలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బిజెపి అధిష్టానం పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను మార్పు చేసింది. సిక్కు ప్రాతినిధ్యాన్ని చాటి చెప్పే వ్యూహాత్మక అడుగులు వేసింది. ఈ మేరకు రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా ఉన్న బర్నాల మాజీ ఎమ్మెల్యే కేవల్ సింగ్ డిల్లాన్ కు పార్టీ అధ్యక్ష బాధ్యతలను బిజెపి అగర నాయకత్వం కట్టబెట్టింది. ఈయన 2007 నుంచి 2017 వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాల నేపథ్యంలో 2022లో బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా ఆయనకి బిజెపి అగ్రనాయకత్వం రాష్ట్ర పార్టీ నాయకత్వం బాధ్యతలను అప్పగించడం ద్వారా ఆయన ప్రాధాన్యతను ఒప్పించింది. ఈ నిర్ణయంతో వచ్చే ఎన్నికల్లో బిజెపి బలమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. పంజాబ్లో అధికారాన్ని సాధించడమే లక్ష్యంగా బిజెపి వ్యూహరచన చేస్తోంది.. ఈ క్రమంలోనే పంజాబ్ కు సరికొత్త నాయకత్వాన్ని అందించింది. అలాగే రాష్ట్రంలోనూ కీలకమైన నాయకులకు కేంద్రంలో మంచి బాధ్యతలను అప్పగించడం ద్వారా పంజాబ్ కు కేంద్ర ప్రభుత్వంలో ప్రాధాన్యతను పెంచి.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో విజయం సాధించడమే లక్ష్యంగా బిజెపి అడుగులు వేస్తోంది. మరి తాజా మార్పులు బిజెపికి ఎంతవరకు కలిసి వస్తాయో చూడాలి. ఇకపోతే రానన్న రోజుల్లో మరికొన్ని రాష్ట్రాల్లోనూ అధ్యక్ష మార్పులు జరిగే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు