Homeజాతీయందేశంలో పట్టాలెక్కనున్న తొలి హైడ్రోజన్ రైలు.. ఆ దేశాల జాబితాలోకి భారత్

దేశంలో పట్టాలెక్కనున్న తొలి హైడ్రోజన్ రైలు.. ఆ దేశాల జాబితాలోకి భారత్

క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- దేశ రైల్వే రంగంలో మరో సరికొత్త అడుగు పడనుంది. ఇప్పటికే అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోటీ పడుతూ వందే భారత్ వంటి వేగవంతమైన రైళ్లను భారత రైల్వే ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలోనే మరో సరికొత్త ఆవిష్కరణకు భారతీయ రైల్వే సిద్ధపడుతోంది. దేశంలో తొలి హైడ్రోజన్ రైలు పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ సన్నద్ధమవుతోంది. పర్యావరణహిత, సుస్థిర రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చే క్రమంలో భాగంగా.. భారతీయ రైల్వే కీలక ముందడుగు వేసేందుకు సన్నద్ధమయింది. హర్యానాలోని (ఉత్తర రైల్వే పరిధి) జింద సోనీ పట్ సెక్షన్ల మధ్య ఈ రైలును ప్రవేశపెట్టడానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఇది సాధారణ రైలులా కాకుండా మెట్రో రైలు ల 10 భోగిలతో ఒకే సెట్ (పది కార్ హైడ్రోజన్ ఫ్యూయల్ ట్రైన్ సెట్) గా ఉంటుంది. 1200 కిలో వాట్ సామర్థ్యం కలిగిన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రొపల్షన్ సిస్టమ్ తో నడిచే ఈ రైలు గరిష్ట వేగం గంటకు 75 కిలో మీటర్లు. భారతీయ రైల్వే ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కొద్దిరోజుల్లోనే రైల్వేలోకి వీటిని అనుసంధానించడం ద్వారా భారతీయ రైల్వే పురోగతిని మరో దశకు తీసుకు వెళ్లేలా చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి పెద్ద ఎత్తున సహకారాన్ని అందిస్తోంది. భారతీయ రైల్వేలో హైడ్రోజన్ రాకతో విప్లవాత్మక మార్పులను మరో దశకు తీసుకువెళ్లినట్టు అవుతుందని రైల్వే భావిస్తోంది.

ఆదేశాల జాబితాలో చేరనున్న భారత్..

హైడ్రోజన్ ఇంధనంతో రైళ్లను నడిపే సాంకేతిక పరిజ్ఞానం అతికొద్ది దేశాల వద్ద మాత్రమే ఉంది. భారత్ ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తే ఆ దేశాల జాబితాలో చేరుతుంది. ప్రస్తుతం హైడ్రోజన్ ఇంధనంతో రైలు నడిపే సాంకేతిక పరిజ్ఞానం జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి దేశాల వద్ద మాత్రమే ఉంది. ఇండియా ఈ రైలను అందుబాటులోకి తీసుకువస్తే ఈ జాబితాలోకి చేరుతుంది. నవ కల్పనలు, ఇంధన సామర్థ్యం, పర్యావరణహిత రవాణా వంటి వాటి పట్ల తమకున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని, భారత్ను కర్బన కాలుష్యం లేని దేశంగా మార్చాలన్న లక్ష్యానికి ఇది ఊతనిస్తుందని భారతీయ రైల్వే ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇదిలా ఉంటే హైడ్రోజన్ రైళ్లు ఎలా నడుస్తాయి అన్న ప్రశ్న చాలామందిని వేధిస్తోంది. ప్రస్తుతం నడిచే రైళ్లు విద్యుత్ తీగలు పైన ఉంటే వాటిని అనుసంధానిస్తూ ముందుకు వెళతాయి. వైర్ల ద్వారా అనే విద్యుత్ సాయంతో రైళ్లు నడుస్తున్నాయి. కానీ హైడ్రోజన్ రొయ్యలకు అలాంటి వైర్ల అవసరం ఉండదు. ఇవి తమకు కావాల్సిన కరెంటును రైళ్లలోనే సొంతంగా ఉత్పత్తి చేసుకుంటాయి. ఇలా తయారు చేసుకోవడానికి హైడ్రోజన్ ను ఎందనంగా ఉపయోగించుకుంటాయి. ఇందుకోసం పై భాగంలో హైడ్రోజన్ ఎంతైనా ట్యాంకులను అమరుస్తారు. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ అనే పరికరాన్ని అమరుస్తారు. ట్యాంకులో ఉన్న హైడ్రోజన్ ను గాలిలో నుంచి ఆక్సిజన్ ఫ్యూయల్ సెల్లోకి పంపిస్తారు. అక్కడ ఈ రెండు కలిసినప్పుడు ఒక రసాయన ప్రక్రియ జరిగే విద్యుత్తు పుడుతుంది. అలా పుట్టిన కరెంటుతో రైలు చక్రాలకు ఉన్న శక్తివంతమైన మోటార్లు తిరుగుతాయి. రైలు ఈ విధంగా ముందుకు కదులుతుంది. అదనంగా వచ్చే కరెంటును బ్రేకులు వేసినప్పుడు ఉత్పత్తి అయ్యే కరెంటును రైలు అడుగు భాగంలో ఉండే లిథియం అయాన్ బ్యాటరీల్లో భద్రపరుస్తారు. రైలు వేగంగా వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ బ్యాటరీ పవర్ కూడా తోడవుతుంది. డీజిల్ ఇంజన్ ల నుంచి విషపూరితమైన పొగ వస్తుంది. కానీ ఈ హైడ్రోజన్ రైళ్ల నుంచి నీటి ఆవిరి మాత్రమే బయటికి వస్తుంది. వీటివల్ల కాలుష్యం ఉండదు. రైలుపై ఉండే ఈ ట్యాంకుల్లో హైడ్రోజన్ ను నింపడానికి జింద వద్ద పూర్తి స్వదేశీ సాంకేతికతతో హైడ్రోజన్ నిల్వ ఇంధనం నింపే కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ రైళ్లు అందుబాటులోకి వస్తే ప్రారంభ దశలో ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరి చేయడానికి అసలు ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికి సుశిక్షితులైన సాంకేతిక నిపుణులు రైళ్లలోనే ప్రయాణిస్తారు. వీలైనంత వేగంగా ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో ఇండియన్ రైల్వే పనిచేస్తుంది.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు