Homeజాతీయంమమత పతనం వెనుక ఐప్యాక్.!

మమత పతనం వెనుక ఐప్యాక్.!

తృణమూల్ కాంగ్రెస్ లో సీనియర్ల తిరుగుబాటు

క్రైమ్ మిర్రర్, పాలిటిక్స్ : బెంగాల్లో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ రోజు రోజుకు ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దీదీ కోట పేక మేడల కూలిపోయింది. అయితే ఆమె ఓటమికి కారణం ఏంటి అంటే మాత్రం అందరి చూపు ఐపాక్ వైఫై అన్నట్టు ఉంది. దశాబ్దాలుగా క్షేత్రస్థాయి పోరాటాలతో, అత్యంత ప్రజాకర్షణ గల నేతగా ఎదిగారు మమతా బెనర్జీ. తన రాజకీయ చతురతను పక్కనపెట్టి.. పూర్తిగా ఐప్యాక్ వంటి కార్పొరేట్ పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థను నమ్ముకున్నారు. ఈ ఘోర పరాజయానికి అదే ప్రధాన కారణం.

  • నాటి దూకుడు ఏది?

బెంగాల్లో మమతా బెనర్జీ దూకుడు రాజకీయాలకు ఫలితమే వామపక్షాల పతనం. కానీ ఆ దూకుడు రాజకీయాలను మరిచి కార్పొరేట్ స్టైల్లో పార్టీని నడపడం.. కేవలం సర్వేలు, డేటా మేనేజ్మెంట్ లక్కే ప్రాధాన్యత ఇవ్వడం వంటి కారణాలు తృణమూల్ కాంగ్రెస్ సాంప్రదాయ నిర్మాణాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమయ్యే సీనియర్ నాయకులను, నమ్మకమైన కేడర్ను పక్కనపెట్టి.. ఐ ప్యాక్ ప్రతినిధులు ఇచ్చిన ఏకపక్ష నివేదికల ఆధారంగా టికెట్లు కేటాయించారు. అదే తీవ్ర అసంతృప్తికి దారితీసింది. పార్టీ నిర్మాణాన్ని పూర్తిగా నాశనం చేసింది.

  • పార్టీలో తిరుగుబాటు..

ఇప్పుడు ఐ ప్యాక్ పై తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు ప్రారంభం అయింది. ఒక్కో నేత బయటకు వచ్చి పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో కార్పొరేట్ తరహాలో ఈవెంట్ మేనేజ్మెంట్ రాజకీయాలు నడపడం కేవలం తాత్కాలిక విజయాలు అందిస్తుంది.. కానీ వచ్చిన విజయాన్ని మాత్రం నిలబెట్టలేదు. ఈ విషయం బెంగాల్లో స్పష్టంగా అర్థమైంది. తన సంప్రదాయ రాజకీయాన్ని మమతా బెనర్జీ నమ్ముకుంటే తప్పకుండా గట్టి పోరాటంతో మూడోసారి అధికారంలోకి వచ్చేవారు. కానీ చేజేతులా ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నారు. భారత రాజకీయాల్లో సొంతంగా ఎదిగిన నేతలకు ఇదో బలమైన హెచ్చరిక. ప్రజల నుంచి వచ్చిన మమతా బెనర్జీ లాంటి నాయకులు.. కార్పొరేట్ సంస్థలను నమ్ముకుంటే ఫలితం ఇలానే ఉంటుంది.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు