జయంతి సందర్భంగా అన్ని పార్టీల నేతల ఘన నివాళి
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: నందమూరి తారక రామారావు జయంతి వేNTRడుకలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. మహానాడు సాక్షిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్టీఆర్కు ఘన నివాళులు అర్పించాయి. సీఎం చంద్రబాబు తో పాటు టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఎన్టీఆర్ సేవలను వివరించే ప్రయత్నం చేశారు.
ఒక్క టీడీపీ నేతలు మాత్రమే కాదు అన్ని పార్టీల నాయకులు ఎన్టీఆర్కు నివాళి అర్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా ఘన నివాళి అర్పించారు. సంక్షేమంతో పాటు అభివృద్ధితో ప్రజల మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని కొనియాడారు..
హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద..
హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు ఘన నివాళులు అర్పించారు. ఆయన మనువడు, హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ నివాళులు అర్పిస్తూ ఘాట్ వద్ద కొద్దిసేపు గడిపారు. బిజెపి నేత, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి తో పాటు కుటుంబ సభ్యుల సైతం నివాళులు అర్పించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మీ పార్వతి సైతం నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.
నందమూరి బాలకృష్ణ తన తండ్రికి ఘన నివాళులు అర్పించి ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని తెలిపారు. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఎన్టీఆర్ పట్ల తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంది. అమీర్పేట మైత్రి వరంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా.. నందమూరి తారకరామారావు విషయంలో ఎటువంటి రాజకీయ పట్టింపులకు పోవడం లేదని రేవంత్ సంకేతాలు పంపారు.
మరోవైపు భారత రాష్ట్ర సమితి నేతలు సైతం ఘన నివాళులు అర్పించారు ఎన్టీఆర్కు. తెలంగాణలో బీసీ రాజ్యాన్ని తెచ్చిన ఘనత నందమూరి తారక రామారావు ది అని గుర్తు చేసుకున్నారు. రెండు రూపాయలకే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు వంటి సాహస నిర్ణయాలు ఎన్టీఆర్ కే సాధ్యం అని కొనియాడారు.
మరోవైపు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఘన నివాళి అర్పించారు ఎన్టీఆర్ కు. ఆయన సేవలను కొనియాడారు. ఇలా అన్ని పార్టీల నేతలు అందరివాడుగా నందమూరి తారక రామారావును కొనియాడుతూ నివాళులు అర్పించడం విశేషం.