Homeఆంధ్ర ప్రదేశ్సీఎం చంద్రబాబుపై జగన్‌ ఫైర్‌.. ప్రజాస్వామ్యానికి ప్రమాదమని వ్యాఖ్య

సీఎం చంద్రబాబుపై జగన్‌ ఫైర్‌.. ప్రజాస్వామ్యానికి ప్రమాదమని వ్యాఖ్య

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా చంద్రబాబు ప్రభుత్వ వ్యవహారశైలిని ఆదివారం తీవ్రస్థాయిలో జగన్‌ ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం అణచివేత చర్యలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని వ్యాఖ్యానించారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు, జర్నలిస్టులు, సోషల్‌ మీడియా యాక్టివిస్టుల గొంతు నులుపుతున్నారని జగన్‌ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం ఈ ప్రభుత్వానికి అలవాటు మారిందని ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లెలో కాపు సామాజికవర్గానికి చెంఇన రైతుల పరామర్శకు వెళుతున్న తమ పార్టీ నేతలు జోగి రమేష్‌, జూపూడి ప్రభాకర్‌, వరికూటి అశోక్‌బాబు తదితర నాయకుల, కార్యకర్తలపై పోలీసులు దాడి అత్యంత హేయమన్నారు.

ఫ్రస్టేషన్‌ ఎందుకు చంద్రబాబు.!

రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని బయటి ప్రపంచానికి చూపిస్తూ, ప్రభుత్వాన్ని నిలదీస్తున్న నాయకులపై పైశాచికంగా వ్యవహరించి, అరెస్టులు చేసిన విధానం దారుణమని జగన్‌ వ్యాఖ్యానించారు. శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళితే చంద్రబాబుకు బీపీ ఎందుకు వస్తోందని, అంత ఫ్రస్టేషన్‌ ఎందుకు చూపిస్తున్నారని జగన్‌ ప్రశ్నించారు. మొక్కజొన్న కనీస రూ.2,400 అయితే ఈ ఏడాది రూ.1400 నుంచి రూ.1600 కూడా రాలేదన్నారు. తీవ్రంగా నష్టపోతున్న రైతులకు న్యాయం చేయాలని, కాపు సామాజిక వర్గానికి చెందిన రైతులు తమ మొక్కజొన్న పంటను, తమకు సంబంధించిన రైతు గోడౌన్‌లో నిల్వ చేసుకుంటే పొన్నూరు ఎమ్మెల్యే దూళ్లిపాళ్ల నరేంద్ర తన అనుచరలతో దాడులు చేయించడమే కాకుండా ఆ రైతులపై అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ కేసులు ఎందుకు పెట్టించారని జగన్‌ ప్రశ్నించారు. కనీస మద్ధతు ధర రూ.2400కు కొనుగోలు చేయకపోయినా దీన్ని ఎవ్వరూ ప్రశ్నించకూడదా.? అని చంద్రబాబును నిలదీశారు.

కేసులతో వేధించడమేనా.?
చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తోందని జగన్‌ విమర్శించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ జర్నలిస్టు, మాజీ ఎమ్మెల్సీ, నిత్యం ప్రజా గొంతుకై నిలిచే ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌పై దగ్గరుండి కేసులు పెట్టించడం దారుణం కాదా.? అని మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ఆయన అన్ని పార్టీల మీదా విమర్శలు చేస్తుంటారని, వార్తాంశాల మీద విశ్లేషిస్తుంటారని, ఆయన నిజం మాట్లాడితే కేసులా.? ప్రశ్నిస్తే అరెస్టులా.? విమర్శిస్తే వేధింపులా.? అంటూ ప్రశ్నించిన జగన్‌.. రాష్ట్రంలో జంగిల్‌ రాజ్‌ చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు గారు దాడులు చుఏసి, ప్రతిపక్షం గొంతు నొక్కి, పోలీసులను రాజకీయ ఆయుదంగా వాడుకుంటూ ఎంతకాలం పాలిస్తారని ప్రశ్నించారు. ప్రజల పక్షాన వైసీపీ పోరాటం చేస్తుందని, ఎప్పటికీ ప్రజలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు