Homeఅంతర్జాతీయంభయపెడుతున్న ఎబోలా.. హెల్త్ ఎమర్జెన్సీ గా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ

భయపెడుతున్న ఎబోలా.. హెల్త్ ఎమర్జెన్సీ గా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ

క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్:- ప్రపంచాన్ని మరో వ్యాధి భయాందోళనలకు గురిచేస్తోంది. ఈశాన్య కాంగోలోని ఇటూరి ట్రావెల్స్ లో వ్యాప్తి చెందుతున్న ఎబోలా వ్యాధి ఇప్పుడు ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేస్తోంది. ఈ వ్యాధి బారిన పడి ప్రతిరోజు వదులు సంఖ్యలో బాధితులు మృత్యువాత చెందుతుండడంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అప్రమత్తమయింది. ఈ వ్యాధి తీవ్రత నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ఎబోలాను అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనకరమైన పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. డబ్ల్యూహెచ్వో ప్రకటనతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఈ వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచ దేశాలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ వ్యాధి కాంగో, ఉగాండా, దక్షిణ సోడాన్ దేశాల్లో వ్యాప్తి చెందుతోంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరికల నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమయింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఆయా దేశాలకు ప్రయాణాలు చేయవద్దని భారత ప్రభుత్వం హెచ్చరించింది.

భారీగా మరణాలు.. ప్రజల్లో ఆందోళన

ఎబోలా వల్ల ఇప్పటి వరకు ఆయా దేశాల్లో వందలాదిమంది మృత్యువాత చెందారు. కాంగోలో ఇప్పటి వరకు 867 మందికి ఈ వ్యాధి వ్యాప్తి చెందగా 204 మంది మృత్యువాత చెందారు. మరికొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు అక్కడి ప్రభుత్వ ప్రతినిధులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ప్రభుత్వాలు అంచనా వేస్తున్నాయి. ఆయా దేశాలకు చెందిన ప్రభుత్వాలు ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు మెరుగైన వైద్య సేవలను అందించడం పైన దృష్టి సారించాయి. అయినప్పటికీ వ్యాధి అదుపులోకి రాకపోవడంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తాజాగా దీనిని అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది.

గతంతో పోలిస్తే అతిపెద్ద వ్యాప్తిగా గుర్తింపు..

గతంలోనూ అనేక సందర్భాల్లో ఎబోలా వ్యాధి వ్యాప్తి చెందింది. ప్రస్తుతం ఎబోలా వ్యాధి వ్యాప్తి చెందుతున్న తీరును పరిశీలిస్తున్న నిపుణులు చరిత్రలో ఇది మూడో అతిపెద్ద ఎబోలా వ్యాధి వ్యాప్తిగా నిపుణులు అంచనా వేస్తున్నారు. 2018లో ఎబోలా వ్యాపించిన సమయంలో దానిని కట్టడ చేయడానికి ఏకంగా రెండేళ్ల పాటు సమయం పట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొన్ని వారాల వ్యాధి లోనే ఈ వ్యాధి మూడు దేశాలకు పాకి వందలాది మందిని ఇబ్బందులకు గురిచేస్తోంది. భౌగోళికంగా కూడా ఈ వ్యాధి వ్యాపించిన ప్రదేశంలో కట్టడి చేయడం చాలా కష్టమని అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈశాన్య కాంగో లోని యుద్ధ ప్రభావిత ప్రాంతమైన ఉగాండా సరిహద్దుల్లో తొలి ఎబోలా కేసు నమోదయింది. అక్కడ ఒక హెల్త్ వర్కర్ వాంతులు జ్వరంతో చికిత్స తీసుకొని కొన్ని రోజుల్లోనే మరణించారు. ఆ తరువాత ఆ మృతదేహాన్ని అంత్యక్రియల కోసం ఇంటికి తరలించారు. దానిని తాకిన చాలా మందిలో కొన్నాళ్లకే ఎబోలా లక్షణాలు బయటపడ్డాయి. వైరస్ సోకిన వారికి కొన్ని వారాలపాటు వ్యాధి లక్షణాలు బయట పడకపోవడంతో ఎక్కువ మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఎబోలా వ్యాధి సరికొత్తగా కనిపిస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. మనుషులకు సోకే నాలుగు రకాల ఎబోలా వైరస్లలో బుండి బుగ్యో ఒకటి. దీనిని ఉగాండాలోని ఒక పర్వత ప్రాంతంలో తొలిసారి గుర్తించారు. గతంలో రెండుసార్లు మాత్రమే వ్యాపించడంతో అధికారులు పెద్దగా దృష్టి పెట్టలేదు. ఫలితంగా తాజాగా వ్యాపించిన ప్రదేశంలో ల్యాబ్ పరీక్షల్లో దీనిని గుర్తించే సౌకర్యం లేకపోవడంతో ఆలస్యం జరిగింది. మొదటిగా దీనిని గుర్తించేందుకు నమూనాలను వేల మైల దూరంలో ఉన్న గవర్నమెంట్ రీసెర్చ్ ల్యాబ్ కు పంపాల్సి వచ్చింది. ఎబోలాలో జైర్ అనే స్ట్రైన్ అత్యంత వేగంగా వ్యాప్తిస్తుంది. దీంతో పోలిస్తే బుండి ఎబోలా వైరస్ రకం కొంచెం నెమ్మదిగానే తన సంఖ్యను పెంచుతుందని పరిశోధకులు చెబుతున్నారు. పచ్చిమాఫ్రికా ప్రాంతంలో జైర్ వేరియంట్ బారినపడి 2014లో 11,300 మంది ప్రాణాలను కోల్పోయారు. దీంతో పోలిస్తే బుండి బుగ్యో సోకిన వారిలో 30 శాతం మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. కాకపోతే దీనికి ఇప్పటివరకు ఎటువంటి వ్యాక్సిన్, చికిత్స లేకపోవడంతో ఇబ్బందికరంగా మారుతోందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు