Homeతెలంగాణతెలంగాణ ఫిల్మ్ చాంబర్‌లో టెన్షన్ వాతావరణం.. అతని రాజీనామా హాట్ టాపిక్!

తెలంగాణ ఫిల్మ్ చాంబర్‌లో టెన్షన్ వాతావరణం.. అతని రాజీనామా హాట్ టాపిక్!

క్రైమ్ మిర్రర్,తెలంగాణ :- తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఎగ్జిబిటర్లు-నిర్మాతల వివాదం మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ తెలంగాణ ఫిల్మ్ చాంబర్ బాధ్యతలకు రాజీనామా చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.సినిమా టికెట్ ధరలు, రెవెన్యూ షేరింగ్, థియేటర్ల నిర్వహణ, చిన్న సినిమాల విడుదల వంటి అంశాలపై ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సునీల్ నారంగ్ రాజీనామా నిర్ణయం మరింత చర్చకు దారితీసింది.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఇటీవల జరిగిన సమావేశాల్లో పలువురు ఎగ్జిబిటర్లు తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా థియేటర్ల సమస్యలపై సరైన స్పందన లేదనే అభిప్రాయం కొందరిలో వ్యక్తమైందని టాక్ వినిపిస్తోంది.అయితే మరోవైపు.. సునీల్ నారంగ్ తీసుకున్న నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమా? లేక ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాల ప్రభావమా? అనే చర్చ కూడా సాగుతోంది. కొందరు ఎగ్జిబిటర్లు మాత్రం ప్రస్తుతం ఇండస్ట్రీకి ఐక్యత చాలా అవసరమని, ఇలాంటి సమయంలో రాజీనామాలు మరింత గందరగోళానికి దారితీసే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారని సమాచారం.
ఇక ఈ వ్యవహారంపై అధికారికంగా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ఫిల్మ్ చాంబర్‌లో వచ్చే రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు