Homeట్రావెల్నిద్రను తేలికగా తీసుకోవద్దు…!

నిద్రను తేలికగా తీసుకోవద్దు…!

Crime Miroor Health Tips: ఈ రోజుల్లో చాలా మంది వాళ్ల ఆర్థిక అవసరాల కోసం ఉద్యోగం చేస్తున్నారు. రాత్రి పగలు అని తేడా లేకుండా పని చేస్తున్నారు. కానీ అన్నింటికన్నా ముఖ్యమైన నిద్ర గురుంచి మాత్రం తేలికగా తీసుకుంటున్నారు. దాని వలన వయసు పెరిగే కొద్దీ అల్జీమర్స్(మతిమరుపు), తొందరగా ముసలితనం రావడం, దీంతోపాటు అనేక రకమైన అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అసలు నిద్ర అంత ముఖ్యమా? అనే ప్రశ్న చాలా మందిలో ఉంది.

మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 8 గంటలు నిద్రపోవాల్సిందే… చాలా మంది రాత్రి లేటుగా నిద్ర పోయి ఉదయం ఆలస్యంగా లేస్తారు. దీని వలన శరీరంలో బద్దకం పెరిగి చేసే పనుల మీద ఇంట్రెస్ట్ లేకపోవడం జరుగుతుంది.

నిద్ర పట్టకపోవడానికి కారణాలు…
చాలా మంది రాత్రి సమయంలో ఎక్కువ ఆహారం తీసుకుంటారు. దీని వలన ఆయాసం వచ్చి నిద్ర పట్టదు. కనుక లైట్ గా ఫుడ్ తీసుకోవాలి. ఇలా అయితే తొందరగా అరుగుతుంది. కంప్యూటర్ దగ్గర కూర్చున్నప్పుడు కళ్లు మంటలు పుట్టి కూడా రాత్రి సమయంలో నిద్ర పట్టదు. మద్యం ఎక్కువగా తీసుకోకూడడు. టెన్షన్లతో, కోపంతో, ఎక్కువ ఆలోచిస్తూ పడుకుంటే కూడా నిద్ర పట్టదు. కొందరికి వేరే ప్రదేశానికి, ఎవరి ఇంటికి అయినా వెళ్లిన నిద్ర రాదు.

నిద్రపట్టడానికి ఏం చేయాలంటే…
కాఫీ ఎక్కువసార్లు తాగే అలవాటు ఉంటే మానేయాలి. ఆరు తర్వాత నిద్రపోకూడదు. రోజు ఒకే సమయానికి పడుకోవడం, లేవడం చేస్తే అదే టైంకి నిద్ర పడుతుంది. తొందరగా తినాలి. కానీ వెంటనే పడుకోకూడదు ఒక రెండు గంటల తర్వాత పడుకోవాలి. పడక గదిలో ఎక్కువ వెలుతురునిచ్చే లైట్లు కాకుండా చిన్న బుగ్గ పెట్టుకోవాలి. రాత్రి సమయంలో కంప్యూటర్, ఫోన్లలను ఎక్కువగా వాడకూడదు. ఒకవేళ ఫోన్ వాడాల్సి వస్తే డార్క్ మోడ్ ఆప్షన్ ని వాడుకోవాలి.

లేదంటే ఇష్టమైన మ్యూజిక్ వింటూ కళ్లు మూసుకుంటూ అలా నిద్రలోకి జారుకోవచ్చు. ఒకేచోట నిద్రపోవాలి. కనుక సమయానికి పడుకుంటే అటు ఆరోగ్యంగానూ, ఇటు సమయానికి పనులు పూర్తి చేసుకుంటూ ఉండవచ్చు. గత కాలంలో ఉన్న చేదు జ్ఞాపకాలను చేరిపేస్తుంది.అందుకే నిద్రను తేలికగా తీసుకోవద్దు. మనిషికి ఆహారం ఎలాగూ నిద్ర కూడా అంతే ముఖ్యం.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు