•తొక్కిసలాట ఘటనను చింతిస్తూ తీవ్ర మనస్థాపం
•బీబీసీ కథనాల్లో ప్రచురితం
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్:-
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన పనిని మొదలుపెట్టారు. అతి కష్టం మీద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మిగతా రాజకీయ పక్షాల మద్దతుతో తమిళనాడులో దశాబ్దాల చరిత్ర కలిగిన రెండు పార్టీలను కాదని అధికారంలోకి వచ్చారు. అయితే ఆ పార్టీలకు భిన్నంగా వెళ్లాలన్న ఆలోచనతో ఉన్నారు. అలానే అడుగులు వేస్తున్నారు దళపతి విజయ్.
ప్రారంభంలోనే కష్టాలు..
తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ పొలిటికల్ ఎంట్రీ సమయంలోనే అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. మొన్నటి ఎన్నికలకు ముంగిట కరూర్ లో ఆయన నిర్వహించిన రోడ్డు షో లో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. తొక్కిసలాట ఘటనలో ప్రమాదవశాత్తు చనిపోయారు. ఆ ఘటనతో విజయ్ రాజకీయం ఇక ముగిసినట్టేనని అంతా భావించారు. అయితే ఏమాత్రం ధైర్యం వీడని విజయ్ ముందుకు సాగారు. ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు.
ఎంతో మనోవేదనకు..
కరూర్ ఘటనతో విజయ్ ఎంతో మనోవేదనకు గురయ్యారు. నిద్రలేని రాత్రులు గడిపారు. ఒకానొక దశలో కేంద్ర సంస్థలు, దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగుతాయని.. విజయ్ అరెస్టు తప్పదన్న ప్రచారం నడిచింది. అప్పుడే బిజెపితో పొత్తుల కథ కూడా బయటకు వచ్చింది. కానీ విజయ్ వెనక్కి తగ్గలేదు. కానీ కరూర్ తొక్కిసలాట ఘటనను మాత్రం చాలా సెంటిమెంట్ గా తీసుకున్నారు విజయ్. విజయ్ సీఎం అయిన నేపథ్యంలో పలు జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు విజయ్ ప్రస్థానానికి సంబంధించిన ప్రత్యేక కథనాలను ప్రచురించాయి. అందులో భాగంగా బీబీసీ మీడియా కరూర్ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన ఓ బాలుడి కుటుంబాన్ని కలిసింది. అయితే ఆ మీడియా ప్రతినిధి ముందు ఆ బాలుడి తండ్రి సంచలన విషయాలను బయటపెట్టారు. విజయ్ గొప్పతనాన్ని.. కరూర్ ఘటన ఆయనను ఎంతగా బాధించిందన్న విషయాన్ని కళ్లకు కడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తమను పరామర్శించడానికి వచ్చిన సందర్భంలో కుర్చీలో కూర్చున్న తన భార్య కాళ్లను తాకిన విజయ్.. కరూర్ తొక్కిసలాటకు కారణమైన తనను మన్నించాలని వేడుకున్నారట. అల్లారం ముద్దుగా పెంచుకుంటున్న వారి కుమారుడు తొక్కిసలాటలో చనిపోయాడు. ఆ కుటుంబానికి తీరని మనోవేదన ఎదురైంది. అయినా సరే ఆ కుటుంబం విజయ్ పార్టీకి ఓటు వేసేందట. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టు విజయ్ పాలన కొనసాగిస్తే మరోసారి ఆయన పార్టీకి ఓటు వేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆ బాలుడి కుటుంబం స్పష్టం చేసినట్టు బీబీసీ తన కథనంలో వెల్లడించింది.