Homeతెలంగాణదారుణం...తండ్రి చేతిలో త‌న‌యుడి హ‌త్య‌...! ఆ ప్రాంతంలో క‌ల‌క‌లం...

దారుణం…తండ్రి చేతిలో త‌న‌యుడి హ‌త్య‌…! ఆ ప్రాంతంలో క‌ల‌క‌లం…

పశ్చిమగోదావరి, క్రైమ్‌మిర్ర‌ర్‌: తండ్రి చేతిలో కుమారుడు హ‌త్య‌కు గురైన ఘ‌ట‌న అత్తిలి మండ‌లం ఈడూరు గ్రామంలో చోటు చేసుకుంది. ఈ దారుణ ఘ‌ట‌న‌తో ఆప్రాంతంలో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం రేగింది. మద్యం మత్తులో తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన గణేశ్ ట్రాక్టర్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. గణేశ్ తరచూ మద్యం సేవించడంతో ఇంట్లో గొడవలు జరిగేవి.

ఈ క్రమంలో అతిగా మద్యం సేవించిన గణేశ్ తన కొడుకు శామ్యూల్‌ రాజు(19)పై దాడి చేశాడు. కత్తెరతో శామ్యూల్‌పై విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. సమాచారం అందిన వెంటనే అత్తిలి పోలీసులు అక్కడకు చేరుకుని నిందితుడు గణేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కన్న కొడుకును తండ్రి అతికిరాతకంగా చంపడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు