HomeతెలంగాణAshu Reddy Engagement: సైలెంట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న అషు రెడ్డి...? వైరల్ అవుతున్న ఫోటోల వెనుక...

Ashu Reddy Engagement: సైలెంట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న అషు రెడ్డి…? వైరల్ అవుతున్న ఫోటోల వెనుక అసలు కథ ఇదే…!


హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్రర్‌: అషు రెడ్డి తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. చేతికి ఉంగరం చూసుకుంటూ సిగ్గుపడుతున్న ఫోటోలను అషు రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ముఖ్యంగా వరుడి చేతిలో చేయి వేసినట్లుగా కనిపించిన పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ ఫోటోలకు అషు రెడ్డి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కేవలం కెమెరా ఎమోజీ మాత్రమే పెట్టడంతో మరింత సస్పెన్స్ పెరిగింది. నిజంగానే ఆమె ఎంగేజ్మెంట్ చేసుకుందా? లేక ఇది ఏదైనా సినిమా లేదా ఫోటోషూట్‌లో భాగమా? అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి.

ఇక కాబోయే వరుడు ఎవరు అనే విషయంపై కూడా సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటివరకు అషు రెడ్డి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఈ ఫోటోలు మరింత చర్చనీయాంశంగా మారాయి. ఇదిలా ఉంటే ఇటీవల అషు రెడ్డి మరో వివాదంలో కూడా వార్తల్లో నిలిచింది. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి, తన కుమారుడిని ప్రేమ మరియు పెళ్లి పేరుతో మోసం చేసి భారీ మొత్తంలో డబ్బులు తీసుకుందని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాదాపు రూ.9.35 కోట్ల మేర మోసం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ కేసులో పోలీసులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. బ్యాంక్ లావాదేవీలు, ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్లు వంటి అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. విచారణపై స్టే ఇవ్వాలని అషు రెడ్డి తరఫున కోర్టులో పిటిషన్ వేయగా, తెలంగాణ హైకోర్టు దాన్ని తిరస్కరించినట్లు సమాచారం.ఈ వివాదం కొనసాగుతున్న సమయంలోనే అషు రెడ్డి ఎంగేజ్మెంట్ ఫోటోలు బయటకు రావడం ఇప్పుడు మరింత ఆసక్తిని పెంచుతోంది.

కొందరు అభిమానులు ఇది నిజమైన ఎంగేజ్మెంట్ అని భావిస్తుండగా, మరికొందరు మాత్రం ఇది కొత్త ప్రాజెక్ట్ ప్రమోషన్ కావచ్చని అంటున్నారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. మరి ఈ వైరల్ ఫోటోలపై అషు రెడ్డి ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు