Homeతెలంగాణమూసీ పునరుజ్జీవన మార్గదర్శకాలు...!

మూసీ పునరుజ్జీవన మార్గదర్శకాలు…!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు (Musi River Rejuvenation Project) కోసం కేబినెట్ సబ్-కమిటీ కొన్ని కీలక మార్గదర్శకాలు మరియు లక్ష్యాలను నిర్దేశించింది. దీని ప్రధాన ఉద్దేశ్యం నదిని ప్రక్షాళన చేయడమే కాకుండా, నగరం యొక్క రూపురేఖలను మార్చి ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడం.

ఈ ప్రాజెక్టును ప్రజల భాగస్వామ్యంతోనే సాకారం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరీవాహక ప్రాంత ప్రజలకు కనీస నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని కమిటీ ఆదేశించింది. నదికి ఇరువైపులా 30 మీటర్ల వెడల్పుతో 6 లైన్ల రహదారిని నిర్మించనున్నారు. దీనితో పాటు 9 మీటర్ల సర్వీస్ రోడ్లు కూడా ఏర్పాటు చేసి, వీటిని ప్రధాన జాతీయ రహదారులకు (విజయవాడ, ముంబై, బీజాపూర్) అనుసంధానం చేస్తారు.

నదికి ఇరువైపులా 50 మీటర్ల బఫర్ జోన్ పాటించాలని నిర్దేశించారు. గండిపేట నుండి గౌరెల్లి వరకు సుమారు 55 కిలోమీటర్ల పరిధిలో 14 మండలాలు మరియు 46 గ్రామాల్లో దశల వారీగా అభివృద్ధి పనులు చేపడతారు. హిమాయత్ సాగర్ నుండి గాంధీ సరోవర్ వరకు (9.2 కి.మీ).

ఉస్మాన్ సాగర్ నుండి గాంధీ సరోవర్ వరకు (11.8 కి.మీ). ఈ పునరుజ్జీవన పనులను 2026 ఆగస్టు నాటికి ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ప్రాథమిక అంచనా ప్రకారం ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ. 7,055 కోట్లు కేటాయించే అవకాశం ఉంది.ఈ ప్రాజెక్టు కేవలం అభివృద్ధి కార్యక్రమంగా కాకుండా, ఒక సామాజిక బాధ్యతగా ప్రభుత్వం పరిగణిస్తోంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు