హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ మూవీ ప్రస్తుతం NBK 111 వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటోంది. ‘వీరసింహారెడ్డి’ తర్వాత ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బాలయ్య సినిమాల్లో మాస్ సాంగ్స్‌కు ఎప్పుడూ ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. థియేటర్లలో అభిమానులు ఈ పాటలకు ఊగిపోతుంటారు. ఈ నేపథ్యంలోనే ‘NBK 111’లో కూడా ఓ పవర్‌ఫుల్ స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ పాట కోసం బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రిని ఎంపిక చేశారన్న వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
బాలయ్య స్టెప్పులు ఎవరితో అంటే…!
‘రాక్‌స్టార్’, ‘హౌస్‌ఫుల్’ వంటి హిందీ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నర్గీస్ ఫక్రి.. ఇప్పుడు బాలయ్యతో కలిసి మాస్ స్టెప్పులు వేయబోతుందనే వార్త అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో ఈ పాట చిత్రీకరణ జరగనుందని సమాచారం. బాలయ్య ఎనర్జీకి తగ్గట్టుగా ఈ పాటలో స్టెప్పులు, మాస్ బీట్‌లు ఉండబోతున్నాయని చెబుతున్నారు.
ఇక హీరోయిన్ విషయంలో కూడా మార్పులు జరిగాయన్న వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. మొదట ఈ సినిమాలో నయనతార నటిస్తుందని ప్రకటించినప్పటికీ, ఇప్పుడు ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె స్థానంలో కాజల్ అగర్వాల్‌ను తీసుకున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే కాజల్ షూటింగ్‌లో పాల్గొన్నట్లు సమాచారం.
నయనతార డేట్స్ సమస్యలు, రెమ్యునరేషన్, ప్రమోషన్స్‌కు సంబంధించిన అంశాల కారణంగానే ఈ మార్పు జరిగిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కాజల్ మాత్రం మూవీ టీమ్‌తో పూర్తి సహకారం అందిస్తున్నట్లు సమాచారం.
ఈ సినిమా పూర్తి స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఇప్పటికే కీలక యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిందని తెలుస్తోంది. త్వరలోనే టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే అవకాశం ఉందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది చివర్లో సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.