మంచిర్యాల, క్రైమ్ మిర్రర్: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంటిలో తరుచుగా టీవీ చూడవద్దని తల్లిడండ్రులు మందలించడంతో డిగ్రీ విద్యార్థిని పురుగుల మందు సేవించి మృతి చెందిన ఘటన మండలంలోని రోటిగూడ గ్రామంలో చోటు చేసుకుంది. దీంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.. ఎస్ఐ ఉదయ్ కిరణ్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని రోటిగూడ గ్రామానికి చెందిన మోత్కూరి అక్షయ(19) లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది.
ఇటీవల తరుచుగా టీవీ చూస్తూ ఉండడంతో ఈ నెల 3న తండ్రి లక్ష్మీనారాయణగౌడ్ మె దటి సెమ్ పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయని రోజు టీవీ చూడడం దేనికని మందలించి వెళ్లి పోగా తల్లి కూడ పొలం పనులకు వెళ్లింది. దీంతో ఎవరు లేని సమయంలో మృతురాలు అక్షయ ఇం టిలోకి వెళ్లి తలుపులు వేసుకొని గడ్డిమందు తాగగా నానమ్మ లక్ష్మి చూసి వెంటనే స్థానికులకు సమాచారం ఇవ్వడంతో అపస్మారక స్థితిలోఉన్న అక్షయను జన్నారం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం కరీంనగర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు అక్కడ పరిస్థితి విషమించి గురవారం తెల్లవారు జామున మృతి చెందింది. అక్షయ తండ్రి లక్ష్మినారాయణ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుఇ దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.