Homeతెలంగాణనిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు...!

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు…!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: నిరుద్యోగులకు సంబంధించి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లలో వయోపరిమితిని పెంచే దిశగా కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా గత పదేళ్లుగా సరైన నోటిఫికేషన్లు లేవని నిరుద్యోగులు విన్నవించడంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దీనిపై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగులకు నెలకు ₹3,000 భృతిని అందించేందుకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే అధికారిక ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో 1,000 మంది బలహీన వర్గాల మహిళలకు 100% సబ్సిడీతో కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు