HomeUncategorizedNominated positions: నామినేటెడ్ పదవుల జాతర....! కాంగ్రెస్ పార్టీలో పని చేసిన వారికి పెద్దపీట ...

Nominated positions: నామినేటెడ్ పదవుల జాతర….! కాంగ్రెస్ పార్టీలో పని చేసిన వారికి పెద్దపీట …

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. గత కొంతకాలంగా ఆశావహులు పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. అదిగో ఇదిగో అంటూ కాలం గడుస్తూ వచ్చింది. అయితే హై కమాండ్ ఆదేశాలతో తెలంగాణ సర్కార్ ఈ పదవులను భర్తీ చేసింది. సీనియర్లకు సముచిత స్థానం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్పొరేషన్ చైర్మన్ ల తో పాటు వైస్ చైర్మన్ ల నియామకం చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. సుమారు 17 కార్పొరేషన్ పాలకవర్గాలకు సంబంధించిన నియామకాలను ప్రకటించారు ఈరోజు.

పెండింగ్ పదవులపై ఫోకస్…

2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత పెండింగ్ పదవుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసింది తెలంగాణ సర్కార్. ఈ నామినేటెడ్ నియామకాల్లో సామాజిక సమతుల్యతను పాటించింది. అన్ని వర్గాల వారికి సముచిత స్థానం కల్పించింది. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ గా శ్రీనివాస్, రజక సహకార కార్పొరేషన్ చైర్మన్ గా అజయ్ కుమార్, గౌడ సహకార కార్పొరేషన్ చైర్మన్ గా మోటుకూరి చంద్రశేఖర్ గౌడ్ నియమితులయ్యారు.

అలాగే మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ గా బొమ్మి శ్రీరామ్, యాదవ కార్పొరేషన్ చైర్మన్ గా రఘునాథ యాదవ్, కమ్మ కార్పొరేషన్ కు బండి రమేష్ ను చైర్మన్గా ఎంపిక చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్గా గుడుగు శ్రీనివాస్, గొర్రెలు మేకల అభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ గా కొల్లే సరిత, తెలుగు అకాడమీ చైర్మన్గా ప్రొఫెసర్ వెంకటనారాయణ నియమితులయ్యారు.

కొత్తగా గ్రామ పంచాయితీ ట్రైబ్యునల్…

మరోవైపు కీలకమైన తెలంగాణ గ్రామపంచాయతీ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తూ దానికి రామిరెడ్డిని చైర్మన్గా నియమించింది రేవంత్ సర్కార్. గ్రామపంచాయతీలకు సంబంధించిన వివాదాల పరిష్కారం కోసం ఈ ట్రైబ్యునల్ పనిచేయనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా ప్రభుత్వం ఈ పదవులను భర్తీ చేసింది. ఇలా నియమితులైన వారు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

అయితే ఇంకా నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తికాలేదు. త్వరలో మరికొన్ని నామినేటెడ్ పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. 2023లో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం నూతన నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది. అయితే కీలకమైన కొన్ని కార్పొరేషన్లకు ఇప్పుడు తాజాగా నియామకాలు పూర్తిచేసింది. త్వరలో మరికొన్ని నియామకాలు చేపట్టనుంది. కాంగ్రెస్ పార్టీలో పని చేసిన వారికి మాత్రమే ఈసారి పెద్దపీట వేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు