Homeఆంధ్ర ప్రదేశ్ఏపీలో టీవీకె.?! విజయ్ పార్టీ విస్తరణ...తెర వెనుక కాంగ్రెస్

ఏపీలో టీవీకె.?! విజయ్ పార్టీ విస్తరణ…తెర వెనుక కాంగ్రెస్

  • తెర వెనుక కాంగ్రెస్

  • క్రిస్టియన్ మైనారిటీ ఓటు బ్యాంకు పై గురి

  • వైసీపీలో గుబులు

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో : తమిళనాడులో దూకుడు మీద ఉన్నారు విజయ్. అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలను మట్టికరిపించి మెజారిటీ సీట్లు దక్కించుకున్నారు. అధికారానికి దగ్గరయ్యారు. అయితే ఇప్పుడు ఆయన తదుపరి టార్గెట్ ఏపీ అని ప్రచారం నడుస్తోంది. త్వరలో ఏపీ ఫై కూడా ఆయన ప్రత్యేకంగా ఫోకస్ పెడతారన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో నడుస్తోంది. రాష్ట్రంలో పొలిటికల్ స్పేస్ ఉండడంతో ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది.

  • మంచి ఫాలోయింగ్..

సినిమా నటుడిగా విజయ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది దక్షిణాది రాష్ట్రాల్లో. ఏపీలో కూడా ఆయనకు యూత్లో మంచి అభిమానులు ఉన్నారు. అందుకే విజయ్ ను ఏపీలో రంగంలోకి దించితే బాగుంటుందన్న అభిప్రాయానికి ప్రశాంత్ కిషోర్ వచ్చినట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేసిన నేపథ్యంలో ఏపీ రాజకీయాలపై పీకే కు స్పష్టమైన అవగాహన ఉంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఉన్న శూన్యతను.. మూడో పార్టీగా భర్తీ చేసేందుకు ఇదే మంచి సమయమని ఆయన సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు కాకున్నా.. వచ్చే ఏడాదిలోగా ఏపీలో టీవీకే విస్తరణ ఖాయం అన్న ప్రచారం నడుస్తోంది.

  • ఆ వర్గం పై గురి..

విజయ్ ఏపీ వైపు దృష్టి పెట్టడానికి ప్రధాన కారణం క్రిస్టియన్ వర్గం. తెలంగాణతో పోల్చితే ఏపీలో క్రిస్టియన్ వర్గం ఎక్కువ. కోస్తాంధ్రలో ఆ వర్గం రాజకీయంగా కూడా ప్రభావితం చేస్తోంది. అయితే ఇప్పటివరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆ వర్గం అండగా ఉండేది. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా ఓటు బ్యాంకు చీలిపోయింది. ఇప్పుడు గాని విజయ్ ఎంట్రీ ఇస్తే.. ఆ వర్గం ఆయన వెంట చేరడం ఖాయం. ఇదే విషయాన్ని ప్రశాంత్ కిషోర్ విజయ్ కు చెప్పారట. మరోవైపు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఒకరు విజయ్ కు ఒప్పించారట. అందుకు ఆయన సమ్మతించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాదిలోగా టీవీ కే విస్తరణ ప్రకటన ఏపీలో ఉంటుందన్న టాక్ నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

  • కాంగ్రెస్ మద్దతుతో..

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో విజయ్ పార్టీకి అండగా నిలిచింది. డీఎంకే కూటమిని వదిలి విజయ్ నీడన చేరింది. అందుకే విజయ్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ కంటి ఏపీ పై ఫోకస్ పెడతారని తెలుస్తోంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా బలపడడం లేదు. అందుకే కాంగ్రెస్ టీవీకే విస్తరణ వెనుక ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో టీవీ కె విస్తరిస్తే ఆ పార్టీతో కాంగ్రెస్ పొత్తు కొనసాగుతుంది. కచ్చితంగా ఏపీలో మూడో ప్రత్యామ్నాయంగా మారుతుంది. ఆ అంచనా తోనే ప్రశాంత్ కిషోర్ విజయ్ కు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. అన్ని సవ్యంగా జరిగితే ఏడాదిలోగా ఏపీలో టీవీ కే విస్తరణ ఉంటుందన్న టాక్ అయితే మాత్రం పొలిటికల్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అదే జరిగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకుకు గండిపడి ఆ పార్టీకి నష్టం జరగడం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు