-
దళపతి విజయ్ పిల్లలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?
-
వారి జీవితాల్లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి!
క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తమిళ స్టార్ హీరో నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన విజయ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు. ఆయన స్థాపించిన టీవీకే పార్టీ తొలి ప్రయత్నంలోనే భారీ విజయాన్ని సాధించడం సంచలనంగా మారింది. అయితే విజయ్ రాజకీయ విజయంతో పాటు ఆయన కుటుంబం, ముఖ్యంగా పిల్లల గురించి కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.
ఆ ఇద్దరూ ఎవరంటే..!
విజయ్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు జాసన్ సంజయ్, కుమార్తె దివ్య సాషా. ప్రస్తుతం వీరిద్దరూ విదేశాల్లో చదువుకుంటూ తమ తమ జీవితాల్లో బిజీగా ఉన్నారని సమాచారం. జాసన్ సంజయ్ సినిమా రంగంపై ఆసక్తి చూపుతున్నాడు.
అయితే తండ్రిలా నటుడిగా కాకుండా, డైరెక్టర్‌గా పేరు సంపాదించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. లండన్‌లో స్క్రీన్‌రైటింగ్ చదివిన ఆయన, కెనడాలోని టొరంటో ఫిల్మ్ స్కూల్లో కూడా ఫిల్మ్ ప్రొడక్షన్లో శిక్షణ పొందాడు. ప్రస్తుతం ‘సిగ్మా’ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
మరోవైపు దివ్య సాషా కూడా తన చదువులపై దృష్టి పెట్టింది. ఆమె గురించి ఎక్కువగా సమాచారం బయటకు రాకపోయినా, కుటుంబానికి దూరంగా కాకుండా తల్లి వద్దే ఉంటూ విద్యను కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక విజయ్ రాజకీయ ప్రచార సమయంలో ఆయన పిల్లలు ఎక్కడా కనిపించకపోవడం అందరిలో ఆసక్తి రేపింది. ముఖ్యంగా జాసన్ సంజయ్ తన తండ్రిని సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేశాడన్న వార్తలు వైరల్ కావడంతో ఈ చర్చ మరింత పెరిగింది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు.
విజయ్ వ్యక్తిగత జీవితంపై కూడా పలు రకాల వార్తలు వస్తున్నాయి. ఆయన, భార్య సంగీత మధ్య విభేదాలు ఉన్నాయని, వారు విడివిడిగా ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పిల్లలు తల్లితో విదేశాల్లోనే ఉంటున్నారని చెప్పబడుతోంది.