Homeవైరల్25 ఏళ్ల కెరీర్… త్రిష దగ్గర ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..?

25 ఏళ్ల కెరీర్… త్రిష దగ్గర ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..?

దక్షిణ భారత సినీ పరిశ్రమలో రెండు దశాబ్దాలుగా తనదైన.. నటనతో..గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్. అందం, నటనతో పాటు ఎన్నో సంవత్సరాల నుంచి సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కొనసాగిన ఘనత కూడా ఆమెకు లభించింది. ఈ క్రమంలో 2026 నాటికి ఆమె సంపాదన, ఆస్తులు గురించి వివరాలు ప్రస్తుతం వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి..

  • త్రిష నెట్ వర్త్ 2026 ఎంత?

2026 సంవత్సరానికి సంబంధించిన రిపోర్టుల ప్రకారం, త్రిష నెట్ వర్త్ సుమారు ₹85 కోట్ల వరకు ఉందని అంచనా. ఈ మొత్తం ఆమె సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, పెట్టుబడులు ద్వారా సంపాదించింది. సినీ రంగంలో స్థిరంగా కొనసాగుతూ, ఆదాయం పెంచుకోవడం ఆమెకు పెద్ద ప్లస్ అయింది.

  • కెరీర్ ప్రారంభం నుంచి స్టార్‌డమ్ వరకు..!

త్రిష తన సినీ ప్రయాణాన్ని 1999లో వచ్చిన జోడి సినిమాతో ప్రారంభించింది. ఆ తర్వాత కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. వర్షం, గిల్లీ, సామి, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే వంటి సినిమాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. తర్వాత కూడా ఆమె కెరీర్ తగ్గలేదు. విన్నైతాండి వరువాయా, 96, పొన్నియిన్ సెల్వన్ వంటి సినిమాలతో మరోసారి తన ప్రతిభను నిరూపించింది. కొత్త హీరోయిన్లు వచ్చినా, త్రిష తన స్థానం నిలబెట్టుకోవడం ఆమె ప్రత్యేకత అని చెప్పవచ్చు.

  • సినిమా రెమ్యూనరేషన్..!

త్రిష ఆదాయం లో పెద్ద భాగం సినిమాల ద్వారానే వస్తుంది. ఒక సినిమాకు ఆమె సుమారు ₹10 నుంచి ₹12 కోట్ల వరకు తీసుకుంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఉదాహరణకు లియో సినిమాలో ఆమెకు దాదాపు ₹5 కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చారని సమాచారం. ఇక బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా కూడా ఆమెకు మంచి ఆదాయం వస్తుంది. ప్రతి సంవత్సరం సుమారు ₹8-9 కోట్ల వరకు బ్రాండ్ల ద్వారా సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది ఆమె మార్కెట్ విలువ ఎంత ఉన్నదో చూపిస్తుంది.

  • రియల్ ఎస్టేట్ ఆస్తులు..!

త్రిషకు చెన్నైలో ఒక లగ్జరీ ఇల్లు ఉంది. దాని విలువ సుమారు ₹10-12 కోట్లు. అలాగే హైదరాబాద్‌లో కూడా మరో ఇల్లు ఉంది, దాని విలువ ₹6-7 కోట్ల వరకు ఉంటుంది. ఈ రెండు నగరాల్లో ఇళ్లు ఉండటం వల్ల ఆమెకు తమిళ, తెలుగు ఇండస్ట్రీలకు దగ్గరగా ఉండే అవకాశం కలుగుతుంది. ఆమె ఆస్తులు చూసినా, చాలా ప్లానింగ్‌తో పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తుంది. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడం ఆమె సంపాదనను మరింత పెంచింది.

  • లగ్జరీ కార్ల కలెక్షన్

త్రిష లగ్జరీ లైఫ్ స్టైల్‌కి మంచి ఉదాహరణ ఆమె కార్ల కలెక్షన్. మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్, బీఎండబ్ల్యూ 5 సిరీస్,‌రేంజ్ రోవర్ ఎవోక్, మెర్సిడెస్-బెంజ్ ఈ-క్లాస్.. ఇలా ఆమె దగ్గర ఎన్నో కాస్ట్లీ కార్లు ఉన్నాయి.
ఈ కార్ల మొత్తం విలువ దాదాపు ₹3-4 కోట్ల వరకు ఉంటుంది.

ఇవి కూడా చదవండి …

  1. తిరుమలలో త్రిష దర్శనం…“రిజల్ట్ మనదే” అన్న ఫ్యాన్‌కు స్మైల్ రిప్లై!

  2. శ్రీలీల కీలక నిర్ణయం… కొత్త దారిలో యంగ్ బ్యూటీ ప్రయాణం!

  3. బాలయ్య మూవీకి షాక్…నో చెప్పేసిన హీరోయిన్…!

  4. Pets in Train: రైలులో మీ పెట్‌తో ట్రావెల్ చేయాలా…?

  5. ఎమ్మెల్యేలను కాపాడుకోవడం ఎలా…? 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు