Homeజాతీయంవిజిల్ మోగింది...ద‌ళ‌ప‌తి ఫ‌స్ట్ అటెంప్ట్‌లోనే పాస్‌...!

విజిల్ మోగింది…ద‌ళ‌ప‌తి ఫ‌స్ట్ అటెంప్ట్‌లోనే పాస్‌…!

  • చ‌రిత్ర తిర‌గ రాసిన టీవీకే

  • తిరిగెళ్లే ఐడియానే లేదంటూ అనే డైలాగ్ విశేష ఆక‌ర్ష‌ణ‌

  • మ‌రో ఎంజీఆర్ గా మారే అవ‌కాశం

  • యూత్ ఐకాన్‌గా విజ‌య్‌

 

చెన్నై, క్రైమ్ మిర్ర‌ర్: టీవీకే చీఫ్ విజయ్ మరో ఎంజీఆర్ గా మారే అవకాశాలు మెండుగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. తమిళనాడు ఎన్నికల్లో ఈ రోజు విజయ్ ప్రభంజనం చూసిన వారికి ఎవరికైనా ఎంజీఆర్ గుర్తుకు రాక మాన‌రంటే అతిశ‌యోక్తి కాదు. 2024 ఫిబ్రవరి 2న విజయ్ తమిళగ వెట్రి కళగం అనే కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాడు. తమిళగ వెట్రి కళగం పార్టీ జెండాను ఆగష్టు 21న ఆవిష్కరించాడు.2025 సెప్టెంబరు 27న కరూర్ లో విజయ్ రాజకీయ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలొ 41 మంది మరణించారు. ఆయన మృతులకు సంతాపం తెలియచేశారు. ఆ తరువాత మృతులు, గాయపడిన వారి బంధువులకు ఎక్స్-గ్రేషియా చెల్లించారు.

రాజకీయాల్లోకి వచ్చిన తరువాత జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీకి ఇచ్చిన తన మొదటి ఇంటర్వ్యూలో విజయ్ తన రోల్ మోడళ్లలో ఎం. జి. రామచంద్రన్, జె. జయలలిత, ఎం. కరుణానిధివంటివారు ఉన్నారని పేర్కొన్నడటం విశేషం. విజయ్ జోసెఫ్ ను తక్కువగా అందరూ అంచనా వేశారు. సినీనటుడు తమిళ ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్న విజయ్ తక్కువ కాలంలోనే రాజకీయంగా ఎదగడం విశేషం. విజయ్ పార్టీని ప్రకటించినప్పుడు అందరూ నవ్వుకున్నారు. కానీ ఆ నవ్వులే ఇప్పుడు నోళ్లు నొక్కుకొనేలా చేశాడు.

జోసెఫ్ విజయ్జోసెఫ్ విజయ్ ప్రధానంగా యువత, మహిళల ఓటు బ్యాంకును రాబట్టడంలో సక్సెస్ అయ్యారు. ఇక తమిళనాడులో ఉన్న లక్షలాది మంది అభిమానులు విజయ్ కు ఈ ఎన్నికల్లో అండగా నిలిచారు. అలా విజయ్ తమిళనాడు ప్రజల నాడిని సులువుగాపట్టాడు. తన మ్యానిఫేస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే కాకుండా, ఏ పార్టీతోనూ కలవకుండా తాను ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించి తన ధైర్యాన్ని చెప్పకనే చెప్పాడు.టీవీకే చీఫ్ విజయ్ పార్టీ పెట్టిన రెండేళ్లలోనే అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.

అడుగ‌డునా అడ్డంకులే….

పార్టీపెట్టినప్ప‌టి నుంచి టీవీకే అధినేత విజ‌య్‌కు అడుగ‌డున అడ్డంకులే ఎదుర‌య్యాయి. తొక్కిస‌లాట ఘ‌ట‌న‌, జ‌న‌నాయ‌గ‌న్ మూవి రిలీజ్‌కు అడ్డంకులు, ఫ్యామిలి స‌మ‌స్య‌లు ఉక్కిరిబిక్కిరయ్యారు. వాటికి ఎదురు నిలిచి ముందుకు సాగాడు. ఇక ఎన్నిక‌ల ప్ర‌చారంలో విజ‌య్ మార్క్ స్ప‌ష్టంగా క‌నిపించింది. ఆయ‌న ద‌ళిత‌, యువ‌త, మ‌హిళ‌ల‌కు పెద్ద పీట వేస్తూ జ‌నాల‌ను విశేషంగా ఆకర్షించాడు. త‌క్కువ అంచ‌నా వేసిన పార్టీల‌కు తానేంటో ఈ ఎన్నిక‌ల్లో నిరూపించాడు. ఏ పార్టీ మ‌ద్ద‌తు లేకుండా టీవీకే నేరుగా పోటిలో బ‌రిలో నిలిచి గెలుపొంది రికార్డులు క్రియేట్ చేసింది. త‌మిళ‌నాడులో విజ‌య్ మ‌రో ఎంజీఆర్‌లా మారే అవ‌కాశం ఉన్న‌ట్లు ప‌లువురు పేర్కొన్న‌డం కొస‌మెరుపు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు