Homeక్రైమ్సంగారెడ్డి జిల్లా ఇరక్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి లొంగిపోయిన భర్త

సంగారెడ్డి జిల్లా ఇరక్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి లొంగిపోయిన భర్త

క్రైమ్ మిర్రర్ : సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్ద మండలం ఇరక్‌పల్లి గ్రామంలో కుటుంబ కలహాలు విషాదానికి దారితీశాయి. భార్యను హత్య చేసిన భర్త అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం… ఇరక్‌పల్లి గ్రామానికి చెందిన ముల్తాన్ తన భార్య ఇర్ఫాన (32)ను ఇంటి నుంచి మౌలాలి దర్గా సమీప ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అనంతరం ఆమె మృతదేహం అక్కడే లభ్యమైంది. మృతురాలికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు సమాచారం. ఘటన అనంతరం ఉదయం సుమారు 5 గంటల సమయంలో నిందితుడు నాగల్‌గిద్ద పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తానే హత్య చేసినట్లు అంగీకరిస్తూ పోలీసులకు లొంగిపోయాడు.

సమాచారం అందుకున్న నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, సీఐ శ్రీనివాస్‌రెడ్డి, నాగల్‌గిద్ద ఏఎస్ఐ రవీందర్ తదితరులు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబ కలహాలే హత్యకు కారణమా లేదా ఇతర అంశాలేమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read : డీఎంకే పార్టీ నేత ఉదయనిధి స్టాలిన్‌ అరెస్ట్.. రాజకీయాల్లో కలకలం!

తాజావార్తలు