Homeతెలంగాణగండిపేట్ మండల విలేఖరుల టియూడబ్ల్యూజే - ఐజేయూ ఎన్నికలు ఏకగ్రీవం!

గండిపేట్ మండల విలేఖరుల టియూడబ్ల్యూజే – ఐజేయూ ఎన్నికలు ఏకగ్రీవం!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- నూతన కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. మండల పరిధిలోని మంచిరేవుల సముదాయ భవనంలో ఈ ఎంపిక కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సలీం పాషా, ఉపాధ్యక్షులు భీమన్న, సంయుక్త కార్యదర్శి పగిడిమర్రి సూర్యనారాయణ, కార్యనిర్వాహక కార్యదర్శి రాజేందర్ రెడ్డి, రాజు తదితర సీనియర్ విలేఖరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, విలేఖరుల సమస్యల పరిష్కారం కోసం యూనియన్ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. విలేఖరులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగిందని, వారి కుటుంబాల ఆరోగ్య భద్రత కోసం ఐదు లక్షల రూపాయిల బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ప్రకటిస్తుందని వెల్లడించారు. విలేఖరులు ఐక్యంగా ఉండి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు, పాలకుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలని సూచించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు సలీమ్ పాషా మాట్లాడుతూ.. సమాజానికి పత్రికలు కళ్ల లాంటివని, విలేఖరులు నిజాయితీగా పనిచేసినప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.

నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం…

యూనియన్ గండిపేట్ మండల నూతన అధ్యక్షుడిగా జి. రాము యాదవ్ (వార్త) ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఉపాధ్యక్షులుగా గోపాల్ (సూర్య), టి. సత్యం గౌడ్ (సాక్షి), బి. ప్రవీణ్ యాదవ్ (దిశ) ఎంపికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా ఎస్. నరేందర్ (తెలుగు ప్రభ), కోశాధికారిగా పి. నర్సింలు, సంయుక్త కార్యదర్శులుగా ఎ. శివకుమార్ (ప్రజా సాక్షి), ఎస్. ప్రభాకర్ (మన తెలంగాణ), జి. నరేష్ కుమార్ (నవ తెలంగాణ) బాధ్యతలు స్వీకరించారు. అలాగే ఆర్గనైజింగ్ కార్యదర్శిగా జి. విజయ్ కుమార్ (ఆంధ్రప్రభ), కార్యవర్గ ప్రతినిధులుగా ఎన్. రామకృష్ణ, విజయ్ ప్రతాప్, దాసరి రవి కుమార్, లక్ష్మి నారాయణ, కోట శ్యామ్ కుమార్, సుగ్రీవ్ ఎన్నికయ్యారు. సంఘం గౌరవ సలహాదారులుగా రాజేందర్ రెడ్డి, రాజు, విష్ణు, సత్యకుమార్ ల నియమకం జరిగింది. అనంతరం నూతన అధ్యక్షుడు రాము యాదవ్ మాట్లాడుతూ, తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. అందరికీ అందుబాటులో ఉంటూ రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీల ఆదేశాలను, కార్యక్రమాలను గండిపేట్ మండలంలో విజయవంతం చేసేందుకు సమిష్టిగా పనిచేస్తామని స్పష్టం చేశారు.

నా గెలుపు బీజేపీకి ఒక మెసేజ్.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు