Homeసినిమాడీప్‌ఫేక్ దుమారం: మృణాల్ ఠాకూర్ ఆగ్రహం.. లీగల్ యాక్షన్ హెచ్చరిక!

డీప్‌ఫేక్ దుమారం: మృణాల్ ఠాకూర్ ఆగ్రహం.. లీగల్ యాక్షన్ హెచ్చరిక!

బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాజాగా మరో వివాదంలో నిలిచారు. సోషల్ మీడియాలో ఆమె పేరుతో ప్రచారం అవుతున్న డీప్‌ఫేక్ ఫొటోలు కలకలం రేపుతున్నాయి. ఈ ఫొటోలు పూర్తిగా మార్ఫింగ్ చేసి, ఏఐ సాంకేతికతతో తయారు చేసినవని మృణాల్ స్పష్టం చేశారు.

తన అనుమతి లేకుండా ఈ చిత్రాలను రూపొందించి, సోషల్ మీడియాలో షేర్ చేయడంపై ఆమె తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పందించిన మృణాల్, “నా పేరుతో ప్రచారం అవుతున్న ఈ ఫొటోలు పూర్తిగా నకిలీ. ఇవి చట్టవిరుద్ధమైనవి. వెంటనే వాటిని తొలగించాలి. ఇకపై ఎవరైనా ఇలాంటి కంటెంట్‌ను షేర్ చేసినా, ప్రచారం చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటాను” అని హెచ్చరించారు.

ఒక ఎంటర్‌టైన్‌మెంట్ పేజ్ ద్వారా ఈ మార్ఫింగ్ ఫొటోలు వైరల్ కావడంతో ఈ అంశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. డీప్‌ఫేక్ టెక్నాలజీ దుర్వినియోగం వల్ల సెలబ్రిటీల గౌరవం దెబ్బతింటోందని మృణాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కంటెంట్ సృష్టించడం, ప్రచారం చేయడం తీవ్రమైన నేరమని కూడా పేర్కొన్నారు.

ఇటీవల కాలంలో ఏఐ టెక్నాలజీ దుర్వినియోగం పెరుగుతోంది. ముఖ్యంగా సినీ నటీమణుల ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం ఎక్కువైంది. ఇంతకు ముందు రష్మిక మందన్న వంటి ప్రముఖులు కూడా ఇలాంటి డీప్‌ఫేక్ వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే.

ఈ ఘటనతో మరోసారి డిజిటల్ సెక్యూరిటీ, వ్యక్తిగత గౌరవ పరిరక్షణపై చర్చ మొదలైంది. డీప్‌ఫేక్ కంటెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు మళ్లీ వినిపిస్తున్నాయి. కాగా, మృణాల్ ఠాకూర్ ఫిర్యాదు తర్వాత సంబంధిత సోషల్ మీడియా సంస్థలు, అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటాయో చూడాలి.

also read: మృతదేహం తరలింపుపై అంబులెన్స్ సిబ్బంది దౌర్జన్యం.. మంచిర్యాలలో వివాదం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు