HomeజాతీయంSabarimala Case: ఆలయంలోకి ఎవరు వెళ్లాలి? భక్తుడా.. నాస్తికుడా? సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Sabarimala Case: ఆలయంలోకి ఎవరు వెళ్లాలి? భక్తుడా.. నాస్తికుడా? సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Sabarimala Row: శబరిమల ఆలయ ప్రవేశ హక్కులపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా, ఆలయంలోకి ప్రవేశం కోరుతున్న వ్యక్తి నిజంగా భక్తుడా? లేక నాస్తికుడా? అన్న విషయాన్ని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని సూచించింది. మతపరమైన ప్రదేశాల్లో హక్కులను నిర్ణయించేటప్పుడు ఈ అంశం కూడా ప్రాముఖ్యత కలిగి ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది.

శబరిమలలోకి మహిళల ప్రవేశంపై విచారణ

శబరిమలతో పాటు ఇతర మత స్థలాల్లో మహిళల ప్రవేశంపై ఉన్న పరిమితులు వివక్షకరమా అనే అంశంపై దాఖలైన పిటిషన్లను 9 మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం పరిశీలిస్తోంది. బుధవారం జరిగిన విచారణలో, 2018లో వచ్చిన తీర్పును సమర్థిస్తూ బిందు, కనకదుర్గ తరఫున సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు వినిపించారు.

సంబంధం లేని వ్యక్తులు హక్కులు అడిగితే ఎలా?

ఈ సందర్భంగా న్యాయమూర్తి నాగరత్న కీలక ప్రశ్నను లేవనెత్తారు. ఆలయంలో ప్రవేశం కోరుతున్నది నిజంగా ఆ ఆలయంపై విశ్వాసం కలిగిన భక్తురాలేనా? లేక ఎవరి ప్రేరణతోనో వచ్చిన నాస్తికురాలా? అని ఆమె ప్రశ్నించారు. అంతేకాకుండా, ఆ ఆలయంతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు, దూర ప్రాంతాల నుండి వచ్చి ప్రవేశ హక్కును కోరితే, ఆ అంశాన్ని కూడా కోర్టు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ వ్యాఖ్యలు మత స్వేచ్ఛ, వ్యక్తిగత హక్కులు, సంప్రదాయాల మధ్య సమతుల్యత ఎలా ఉండాలనే విషయంపై మరోసారి చర్చకు దారితీసాయి. శబరిమల కేసు దేశవ్యాప్తంగా మతాచారాలు, రాజ్యాంగ హక్కుల మధ్య ఉన్న సున్నితమైన సంబంధాన్ని వెలుగులోకి తీసుకువస్తోంది.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు