Homeఆంధ్ర ప్రదేశ్అమ్మ‌వారి స‌న్నిధిలో ఉప రాష్ర్ట‌ప‌తి సీపీ రాధాకృష్ణ‌న్‌...అర్చ‌కుల ఘ‌న స్వాగ‌తం...!

అమ్మ‌వారి స‌న్నిధిలో ఉప రాష్ర్ట‌ప‌తి సీపీ రాధాకృష్ణ‌న్‌…అర్చ‌కుల ఘ‌న స్వాగ‌తం…!

తిరుప‌తి, క్రైమ్ మిర్ర‌ర్‌: భారత ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ మంగళవారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఉపరాష్ట్రపతికి అర్చకులు సంప్రదాయబద్ధంగా ఇస్తికాపాల్ స్వాగతం పలికారు. ఆయన ఆలయంలోని ధ్వజస్తంభానికి మొక్కుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.

అనంతరం ఆశీర్వాద మండపంలో టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర అమ్మవారి ప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, టీటీడీ బోర్డు సభ్యులు జి.భానుప్రకాశ్ రెడ్డి, జేఈవో వి వీరబ్రహ్మం, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, సీవీఎస్వో మురళీకృష్ణ, తిరుచానూరు ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాధ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు