క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట రాజధానిగా అమరావతి త్వరగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక రాష్ట్ర రాజధాని అంటే ఆ రాష్ట్రానికి సిరిసంపదలు తెచ్చే విధంగా ఉండాలి కానీ రాష్ట్రాన్ని దివాళ తీసే విధంగా ఉండకూడదు అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీరుతో రాష్ట్రం మొత్తం కూడా నాశనం అవుతుంది అని అన్నారు. అమరావతి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుదిబండ గా మారింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రెస్ మీట్ లో మావిగన్ ప్రతిపాదన తీసుకువస్తే.. బూతులు తిట్టిస్తారా?.. అని ప్రశ్నించారు. అసలు అమరావతి కాన్సెప్ట్ లో మీకు సత్తా లేదా?.. అంటూ ప్రశ్నలు సంధించారు. నమ్మిన ప్రతి ఒక్కరిని చంద్రబాబు నాయుడు మోసం చేశారు అని తెలిపారు. చంద్రబాబు చేసిన మోసాలపై తెలుగుదేశం పార్టీ నేతలు బయోస్కోప్ వేస్తారా?.. అని తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో భాగంగా రాష్ట్ర రాజధానిపై అలాగే కూటమి నేతలపై తీవ్రంగా ఫైర్ అయ్యారు.
ప్రపంచ మేధావి అంబేద్కర్…సీఎం రేవంత్ రెడ్డి…!
