Homeరాజకీయంటార్గెట్ మంత్రి సీతక్క!

టార్గెట్ మంత్రి సీతక్క!

  • అంగన్వాడీల సెల్ఫోన్ల కొనుగోలులో భారీ అవినీతి

  • మంత్రి సీతక్క లక్ష్యంగా బీఆర్ఎస్ ఆరోపణలు

  • తప్పుడు ప్రచారం చేస్తే చెప్పు తెగుద్ది అంటూ మంత్రి తిరిగి హెచ్చరికలు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ మంత్రి సీతక్క ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తే చెప్పు తెగుతుందని హెచ్చరించారు. అంగన్వాడీ టీచర్లకు ఇచ్చిన సెల్ ఫోన్లలో అవినీతి జరిగిందంటూ వస్తున్న వార్తలను ఖండించారు. ప్రభుత్వ పథకాలపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. మేడారం పునర్నిర్మాణ పనుల్లో అవినీతి జరిగిందంటూ వస్తున్న ఆరోపణలను కూడా తిప్పికొట్టారు సీతక్క. తాజాగా ములుగులో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజకీయ ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలే పంపారు. ప్రస్తుతం సీతక్క కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  • సెల్ ఫోన్లతో పాటు మేడారం నిర్మాణాలపై

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు సెల్ ఫోన్లు అందించింది. ఒక్కో సెల్ ఫోన్ ను రూ.11,650కు కొనుగోలు చేసింది. అయితే విపక్షాలతో పాటు సోషల్ మీడియాలో ఒక్కో సెల్ఫోన్ రూ.14 వేలకు కొనుగోలు చేసినట్లు భారీ అవినీతి జరిగినట్లు మంత్రి సీతక్క పై ఆరోపణలు చేశారు. సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేశారు. అందుకే ఈ ప్రచారంపై స్పందించారు సీతక్క. తాను ఎక్కడ అవినీతి చెయ్యలేదని స్పష్టం చేశారు. మరోవైపు ఇటీవల మేడారం మహా జాతర అంగరంగ వైభవంగా జరిగింది. అందుకు ముందస్తుగా మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులను చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో కూడా భారీగా అవినీతి జరిగిందన్న ఆరోపణలు, ప్రచారం జరిగింది. దీనిపై కూడా మంత్రి సీతక్క స్పందించారు. మేడారం పనుల్లో అవినీతికి తావు లేదని పేర్కొన్నారు. ఏవైనా ఆధారాలు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. అవసరమైతే మేడారం అవినీతి ఆరోపణలపై సిబిఐ విచారణ చేయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

  • మంత్రి సీతక్క ఘాటు స్పందన..

ఇటీవల గులాబీ పార్టీ నేతలు మంత్రి సీతక్కను టార్గెట్ చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలు కావడం ఇందుకు కారణం. ఆమెపై పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీగా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఆమెపై పార్టీ మారాలన్న ఒత్తిడి ఉండేది. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆమెపై ప్రలోభాల పర్వం నడిచింది. ఆ విషయాన్ని గుర్తు చేసి మరి ఇప్పుడు సీతక్క గులాబీ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో తనను ఓడించేందుకు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి.. తప్పుడు ప్రచారం చేశారని మండిపడుతున్నారు. ఇప్పుడు అవినీతి జరిగిందంటూ మరక అంటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి వాటికి భయపడేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆరోపణలు చేస్తే తగిన విధంగా బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు.

  • గులాబీ పార్టీ అవే ఆరోపణలు..

మరోవైపు సీతక్క హెచ్చరించిన తర్వాత కూడా గులాబీ పార్టీ నుంచి అదే స్థాయిలో ఆరోపణలు ఆమెపై వస్తున్నాయి. బిఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పై సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి సీతక్కకు చెందిన మహిళా శిశు సంక్షేమ శాఖలో రూ.30 కోట్ల కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు. ఫాషన్ అభియాన్ అనే కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా అంగన్వాడీ టీచర్లకు 38,130 స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసేందుకు రూ.54.19 కోట్లుతో టెండర్లు పిలిచారని గుర్తు చేశారు. 64 జిబి మెమరీ కలిగిన సాంసంగ్ 4జి మోడల్ ఫోన్లను అంగన్వాడీ టీచర్లకు పంపిణీ చేయాలని నిర్ణయించాలని వెల్లడించారు. కానీ టెండర్ నోటిఫికేషన్లో మాత్రం 5జి ఫోన్లను చూపించినట్లు ఆయన ఆరోపణలు చేశారు. ఆ మోడల్ ఫోన్ ధరలు రూ.6000 మాత్రమేనని.. కానీ మొత్తం ఖర్చులతో కలిపి రూ.14,500 చెల్లించినట్లు టెండర్ లో పేర్కొన్నారని చెప్పుకొచ్చారు.. అయితే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అంగన్వాడీ సెల్ ఫోన్ల కొనుగోలు వార్ నడుస్తోంది.

ఇవి కూడా చదవండి ….

  1. రేపు ఉదయం 11 గంటలకు.. తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల

  2. తెలంగాణ పోలీస్ బాస్ సివి ఆనంద్…!

  3. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో వేడెక్కిన రాజ‌కీయం…ఇద్ద‌రు నేత‌లు మాట‌ల యుద్దం…!

  4. ఆపరేషన్ ఐలాపూర్…6 అంత‌స్తుల భ‌వ‌నం నేల‌మ‌ట్టం…!

  5. చిరకాల శత్రువు చెంతకు జీవన్ రెడ్డి.!

  6. Big breaking: ఆప‌రేష‌న్ ఖ‌గార్ ఎఫెక్ట్‌…మ‌రో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు