Homeతెలంగాణగులాబీ పార్టీకి స్వల్ప ఊరట...!

గులాబీ పార్టీకి స్వల్ప ఊరట…!

  • ఆ రెండు మున్సిపాలిటీలు బిఆర్ఎస్ ఖాతాలో

  • కష్ట సమయంలో ఉపశమనం

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది భారత రాష్ట్ర సమితి. ఒకప్పటి తెలంగాణ ఉద్యమ పార్టీగా.. బంగారు తెలంగాణ పార్టీగా.. ఇలా రకరకాలుగా రూపాంతరం చెందిన ఆ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. కొన్నిచోట్ల డిపాజిట్ కూడా కోల్పోయింది. ఇక ఆ పార్టీకి భవిష్యత్తు లేదు అని భావించిన చాలామంది ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పారు. కీలక నేతలు సైతం రాజీనామా ప్రకటించి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అయితే అసెంబ్లీ నుంచి మొన్నటి పంచాయితీ ఎన్నికల వరకు తీవ్ర స్థాయిలో దెబ్బతిన్న ఆ పార్టీకి తాజాగా రెండు మున్సిపల్ చైర్మన్ పీఠాలు దక్కడం ఉపశమనం కలిగించే విషయం.

రెండు నెలల కిందట ఎన్నికలు..
రెండు నెలల కిందట తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. కానీ మున్సిపల్ చైర్మన్ల ఎంపిక విషయంలో సాంకేతికపరమైన అంశాలతో వాయిదా పడుతూ వచ్చిన ఇబ్రహీంపట్నం, క్యాతన్ పల్లిలో గులాబీ పార్టీ నేతలే చైర్మన్లుగా ఎన్నిక కావడం ఆ పార్టీకి ఉపశమనం. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రిజర్వేషన్ రగడ చోటుచేసుకుని ఇక్కడ చైర్మన్ ల ఎన్నికలు ఆలస్యమయ్యాయి. శనివారం నిర్వహించిన ఎన్నికల్లో బిఆర్ఎస్ తీవ్ర ఉత్కంఠ మధ్య విజయం దక్కించుకుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో సంఖ్యాబలం బిఆర్ఎస్ కు ఎక్కువ. అందుకే ఆ పార్టీ తరఫున సుదర్శన్ రెడ్డి చైర్మన్గా ఎన్నికయ్యారు. అయితే ఇక్కడ బిజెపి అభ్యర్థి ముత్యాల శ్యామల భాస్కర్ వైస్ చైర్మన్ గా ఎన్నిక కావడం విశేషం. మంచిర్యాల జిల్లాలో కీలకమైన క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ని సైతం గులాబీ పార్టీ దక్కించుకుంది. ఆ పార్టీకి చెందిన సంధ్యారాణి చైర్మన్ గా.. సిపిఐ కి చెందిన సరిత వైస్ చైర్మన్ గా ఎంపిక కావడం విశేషం.

పంచాయతీ ఎన్నికల్లో విఫలం..
పంచాయితీ ఎన్నికల్లో గులాబీ పార్టీ అనుకున్న స్థాయిలో పట్టు సాధించలేకపోయింది. 60 శాతానికి పైగా పంచాయతీలను అధికార కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల విషయానికి వస్తే మాత్రం ఉనికి చాటుకోగలిగింది. ఓ 18 మున్సిపాలిటీల్లో బిఆర్ఎస్ పాగా వేసింది. తాజాగా రెండు మున్సిపాలిటీలతో ఆ సంఖ్య 20 కు చేరుకుంది. అయితే ఒక్కటి మాత్రం నిజం. బిజెపితో గులాబీ పార్టీ జతకలిస్తే మంచి ఫలితాలు వస్తాయని స్పష్టం అవుతుంది. మరోవైపు సిపిఐ మనసు కూడా మారుతుంది. కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి గులాబీ పార్టీతో జత కలిసేందుకు సిపిఐ సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు అందిస్తోంది. అయితే తెలంగాణలో పొత్తుల లెక్కలకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి ….

  1. Telangana: ఆధ్యాత్మిక రాజకీయం…!

  2. Revanth Master Plan: త్రిశూల్ వ్యూహం.. బల్దియా పై రేవంత్ స్పెషల్ గురి!

  3. Cabinet Expansion: మంత్రివర్గ విస్తరణకు బ్రేక్.. ఆశావహులపై సీఎం రేవంత్ నీళ్లు!

  4. Telangana: కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు…!

  5. ఆ మత మార్పిడిల వెనుక జగన్…?!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments