Homeఅంతర్జాతీయంయుద్దంలో గెలిస్తే హ‌ర్మూజ్‌లో టోల్ వ‌సులు చేస్తాం..! ట్రంప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు...

యుద్దంలో గెలిస్తే హ‌ర్మూజ్‌లో టోల్ వ‌సులు చేస్తాం..! ట్రంప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…

ఢిల్లీ, క్రైమ్‌మిర్ర‌ర్ః యుద్దం ప‌శ్చిమాసియ‌లో రోజు రోజుకు భీక‌రంగా మారుతుంది. కాగా యుద్దం మొద‌లైన‌ప్ప‌టి నుంచి హ‌ర్మూజ్ జ‌ల‌సంధి కేంద్ర బిందువుగా మారింది. చ‌మురు ర‌వాణ‌కు మూల బిందువు కావ‌డంతో అంత‌ర్జాతీయ రాజ‌కీయాలు వేడెక్కాయి. అయితే ఈ జ‌ల‌సంధి ఇరాన్ నియంత్ర‌ణ‌లోకి తెచ్చుకొని అంత‌ర్జాతీయంగా ఇంధ‌న సంక్షోభం సృష్టించింది. కాగా ఈ జ‌ల‌సంధి గుండా వెళ్లే చ‌మురు నౌక‌ల‌పై ఇరాన్ టోల్ వ‌సూలు చేస్తుంద‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

గెలిస్తే టోల్ వ‌సూలు…

తాజాగా ఈ జలసంధిపై అమెరికా కూడా కన్నేసినట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ‘హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల నుంచి ఇరాన్ రుసుము వసూలు చేయడానికి అనుమతించే ఒప్పందాన్ని అంగీకరిస్తారా’ అని సోమవారం ట్రంప్‌ను మీడియా ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ.. ‘అసలు టోల్ ఫీజ్ మనం వసూలు చేస్తే ఎలా ఉంటుంది? యుద్ధంలో పూర్తిగా పై చేయి సాధించిన తర్వాత మనమే అలా చేయడం మేలు. మనం ఎందుకు చేయకూడదు? విజేత మనమే. మనం దాదాపుగా గెలిచాం’ అని ట్రంప్ అన్నారు.

ఇరాన్ నిరంతరంగా డ్రోన్, క్షిపణి దాడులు చేస్తున్నప్పటికీ, హోర్ముజ్‌ దిగ్బంధనం కొనసాగిస్తున్నప్పటికీ, ఇరాన్ సైనికంగా ఓడిపోయిందని ట్రంప్ పునరుద్ఘాటించారు. ఇరాన్‌తో కుదిరే ఏ ఒప్పందంలోనైనా హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, చమురు రవాణా స్వేచ్ఛగా జరగడం తప్పనిసరిగా ఉంటుందని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments