Homeఅంతర్జాతీయంఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు... ఆ దేశాలు ప‌శ్చాత్తాప ప‌డే వ‌ర‌కు...

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు… ఆ దేశాలు ప‌శ్చాత్తాప ప‌డే వ‌ర‌కు దాడులు కొన‌సాగుతాయి

ఢిల్లీ, క్రైమ్ మిర్ర‌ర్ : ఇజ్రాయిఎట్‌, అమెరికా, ఇరాన్ దేశాల మ‌ధ్యు ఉద్రిక్త‌లు త‌గ్గించే దిశ‌గా ఒక ప‌క్క చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ చెబుతున్న‌ప్ప‌టికీ ఇరాన్ మాత్రం వెనుక‌కు త‌గ్గ‌డం లేదు. ఈ రెండు దేశాలు చేసిన దురాక్ర‌మ‌ణ‌కు వారు ప‌శ్చాత్తాప ప‌డే వ‌ర‌కు మా దాడులు కొన‌సాగుతాయ‌ని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తేల్చి చెప్పారు. కాగా త‌మ మిత్ర దేశం చైనాతో ఫోన్ సంభాషణలో భాగంగా అరాగ్చీ ఈ వ్యాఖ్యలు చేసినట్టు మీడియా కథనాలు వెల్లడించాయి.

ఇస్లామిక్ రిపబ్లిక్‌కు చెందిన పౌర, రక్షణ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా శత్రు దేశాలు దాడులు చేయడంతోనే టెహ్రాన్‌లో అస్థిరత చోటుచేసుకుందని అరాగ్చీ తెలిపారు. ‘మా లక్ష్యాలన్నీ నెరవేరడం సహా హింసాత్మక దురాక్రమణకు పాల్పడిన శత్రు దేశాలు పశ్చాత్తాప పడేవరకూ ప్రతీకార దాడులు కొనసాగుతాయి. దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడమే మా తొలి ప్రాధాన్యం’ అని ఇరాన్ విదేశాంగ మంత్రి చెప్పారు. కాగా హ‌ర్మూజ్ జ‌ల‌సందిని మూసివేయ‌డం, మేము తీసుకున్న చ‌ర్య‌ల‌న్ని అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌కు అనుగుణంగా ఉన్నాయ‌ని తెలిపారు.

ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చలకు అమెరికా సంకేతాలిస్తుండగా.. టెల్ అవీవ్‌లోని ఇజ్రాయెల్ గూఢచర్య కేంద్రాలే లక్ష్యంగా వరుస దాడులు ప్రారంభించినట్టు ఐఆర్‌జీసీ తెలిపింది. ఇరాన్‌లో ప్రముఖ వ్యక్తులతో తమ చర్చలు కొనసాగుతున్నాయని, ఇది పాలనాపరమైన మార్పునకు సంకేతమని యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ పేర్కొన్న తరుణంలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

తాజావార్తలు