Homeతెలంగాణటార్గెట్ రేవంత్...!

టార్గెట్ రేవంత్…!

  • సోదరులతో పాటు కుటుంబం పై వ్యతిరేక ప్రచారం

  • అవినీతి ముద్ర వేసేందుకు ఆరాటం

  • గతంలో కెసిఆర్ ఫ్యామిలీ పై అవినీతి ముద్ర

  • అందుకే ఇప్పుడు రివర్స్ ప్రయత్నంలో గులాబీ పార్టీ

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: గులాబీ పార్టీ, సీఎం రేవంత్ విషయంలో ప్రత్యేక వ్యూహంతో వెళ్తోందా? రేవంత్ రెడ్డి సోదరులకు అవినీతి మరక అంటిస్తోందా? గతంలో కెసిఆర్ ఫ్యామిలీ ఎలా పలుచన అయిందో.. అదే మాదిరిగా రేవంత్ కుటుంబం పై చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి.

  • రేవంత్ ప్రస్థానం..

తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డికి ప్రత్యేక స్థానం. ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తే ఎన్నెన్నో ఇబ్బందులను అధిగమించి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. అది కూడా తనకు ఎదురైన పరిణామాలను అనుకూలంగా మలుచుకుంటూ ఆయన సాగించిన ప్రయాణం సాహసోపేతమైనది.

అందుకే తెలంగాణ సమాజంలో ఆయనకు ప్రత్యర్థులు, శత్రువులు ఎక్కువే. ఇప్పుడు వారి లక్ష్యం రేవంత్ రెడ్డిని పలుచన చేయడం. అందుకే వారు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇప్పుడు రేవంత్ కుటుంబాన్ని టార్గెట్ చేసుకుంటున్నారు ప్రత్యర్థులు.

ప్రధానంగా ఆయన సోదరుడు కొండల్ రెడ్డి టార్గెట్ అవుతున్నారు. ఆయన కంపెనీ కి తెలంగాణ సర్కార్ కోట్లాది రూపాయల భూములను కారు చౌకగా కట్టబెట్టిందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు.

  • సోషల్ మీడియాలో ప్రచారం..

కుటుంబ సభ్యులపై నిందలు వేసి రాజకీయ చలి మంటలను కాచుకోవాలని చూస్తోంది భారత రాష్ట్ర సమితి. కనీస ఆధారాలు లేకుండా సోషల్ మీడియా వేదికగా రేవంత్ సోదరుడిపై ఆరోపణలు చేస్తోంది. రేవంత్ సాదరుడు కొండల్ రెడ్డికి చెందినదిగా చెబుతున్న టెస్సరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కంపెనీ మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల వద్ద ఉందని.. దానికి కోట్ల రూపాయల విలువైన భూమిని నామమాత్రపు ధరకు కట్టబెట్టారని సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు.

కానీ ఇటువంటి ఆరోపణలు చేసినప్పుడు చట్టబద్ధమైన ఆధారాలు, కేటాయింపు నిబంధనల ఉల్లంఘనను నిరూపించకుండా కేవలం.. సోషల్ మీడియా పోస్టులు, నినాదాలకి పరిమితం కావడం రాజకీయ వ్యూహాల లోపాలను ఎండగడుతోంది. ప్రధానంగా కార్పొరేట్ రికార్డులు,, పరిశ్రమల శేఖర్ నిబంధనలను పరిశీలిస్తే.. తెలంగాణలో డిఫెన్స్, ఏరో స్పేస్, ఐటీ, తయారీ రంగంలో పెట్టుబడి పెట్టే ఏ కంపెనీ కైనా పారిశ్రామిక విధానం ధరల నిర్ణయాధికార కమిటీల ద్వారా భూముల కేటాయింపులు జరుగుతాయి.

ఒకవేళ ఏదైనా కంపెనీ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తే.. ముందుగా కేటాయించిన ధర సాధారణ కేటాయింపుల ధర కంటే తక్కువగా ఉందా? లేదా? గత ప్రభుత్వ హయాంలో నిర్ణయించిన పారిశ్రామిక రీచ్ రూల్స్ ను వర్తింపజేశారా? అనేది పక్కాగా సవాల్ చేయాల్సి ఉంటుంది.

[[[కానీ ఇవేవీ పరిగణలోకి తీసుకోకుండా రూ. 135 కోట్ల రూపాయల భూమిని కేవలం రూ.3707 ఇచ్చారు అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే ఇటువంటి వాటికి ఆధారాలతోని ప్రచారం చేస్తేనే విలువ ఉంటుంది. లేకుంటే తిరిగి ప్రతికూలత చూపడం ఖాయం.

  • ప్రత్యేక వ్యూహం..

ప్రస్తుతం గులాబీ పార్టీ వ్యూహం స్పష్టంగా తెలుస్తోంది. తెలంగాణ సమాజంలో కేసీఆర్ కుటుంబ పాలనపై చాలా రకాల విమర్శలు వచ్చాయి. ఆ కుటుంబ సభ్యులపై భారీ అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అవినీతి మరకను రేవంత్ రెడ్డికి అంటించాలన్నదే వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే గత కొన్ని నెలలుగా ప్రతి అంశాన్ని సీఎం సోదరులకు జత కలుపుతూ విమర్శలు చేస్తున్నారు.

కేవలం అవినీతి ముద్ర వేసి రేవంత్ ఫ్యామిలీని పలుచన చేయాలన్నది ప్రణాళికగా కనిపిస్తోంది. అయితే చట్టపరమైన ఆధారాలు చూపకుండా కేవలం సోషల్ మీడియా పోస్టులకు సరిపెడితే ప్రజల్లో విశ్వసనీయత పెరగదు సరి కదా.. రాజకీయ పగ తీర్చుకోవడానికి బురద జల్లుతున్నారనే భావన కలగక మానదు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు